
తనకు సీక్రెట్ గా పెళ్లి అయ్యిందని వెల్లడించింది హీరోయిన్ పూర్ణ. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తని దుబాయ్ లో జూన్ 12 న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని అసలు విషయాన్ని బయటపెట్టింది. గతకొంత కాలంగా పూర్ణ పెళ్లి గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
మలయాళ భామ అయిన పూర్ణ అసలు పేరు షామ్నా ఖాసిం. అయితే సినిమాల్లోకి వచ్చేముందు తన పేరుని పూర్ణ గా మార్చుకుంది. తెలుగు , తమిళ , మలయాళ భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా స్టార్ డం అందుకోవాలని ఆశ పడింది కానీ ఆ స్థాయి అందుకోలేక పోయింది.
దాంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఓ ముఠా పూర్ణ ను మోసం చేసింది. ప్రేమ , పెళ్లి పేరుతో ఆమెను కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బు , నగలు కాజేయాలని చూసారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టింది పూర్ణ. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఇక దాంతో తెలిసిన వాళ్ళ ద్వారా దుబాయ్ వ్యాపారస్థుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. జూన్ లో పెళ్లి అయితే ఇప్పుడు ఆ విషయాన్ని బయటపెట్టింది.