
ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. మూడు దశాబ్దాల క్రితం వాలయింటైన్స్ డే అనేది భారత్ లో పెద్దగా జరుపుకోలేదు. కానీ మెల్లి మెల్లిగా పాశ్చాత్య సంస్కృతి భారత్ లో ఎక్కువయ్యింది. ఇంకేముంది ఫిబ్రవరి 14 వస్తోందంటే చాలు బోలెడంత హంగామా చేస్తున్నారు యువతీయువకులు. ప్రేమకు ఒక్క రోజును మాత్రమే స్పెషల్ గా చూడటం …… ఆరోజున మాత్రమే ప్రేమను వ్యక్తీకరించడం ఏంటి అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయాలను పక్కన పెడితే ……. పలువురు నటీనటులు కలిసి నటించడం వల్ల ప్రేమలో పడ్డారు…… ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ జాబితా ఒకసారి చూద్దామా! పాతతరంలో మహానటి సావిత్రి – జెమిని గణేషన్ పలు చిత్రాల్లో కలిసి నటించారు. దాంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి అయ్యాక ఎవరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది…… ఎంతటి విషాదాన్ని నింపింది అనేది తెలిసిందే. అలాగే మరో సీనియర్ నటి శారద – నటుడు , దర్శక నిర్మాత చలం కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు…… పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల కాపురం తర్వాత విడిపోయారు. సీనియర్ల విషయాన్ని పక్కన పెడితే …….

కింగ్ నాగార్జున – అమల కలిసి పలు చిత్రాల్లో నటించారు. ప్రేమలో పడ్డారు……. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ రాజశేఖర్ – జీవిత కలిసి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. అలా ఈ ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. శ్రీకాంత్ – ఊహ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ప్రేమించుకున్నారు…… పెళ్లి చేసుకున్నారు. రోజా దర్శకుడు సెల్వమనిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ కలిసి నటించారు…… ప్రేమించుకున్నారు. తర్వాత విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అన్నా లెజ్ నోవా తో కలిసి ఓ సినిమాలో నటించాడు. అక్కడ ఆమెతో ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మ్యాటర్ పెద్ద సంచలనం అనే విషయం తెలిసిందే.

మహేష్ బాబు – నమ్రత కలిసి నటించారు…… ప్రేమలో పడ్డారు. పెద్దలను ఎదురించి పెళ్లికి సిద్ధమయ్యారు. కట్ చేస్తే చివరి నిమిషంలో పెద్దలు అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు. రాంచరణ్ – ఉపాసన లది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. కాకపోతే ఉపాసనకు సినిమా రంగంతో సంబంధం లేదు. అల్లు అర్జున్ కూడా స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. స్నేహా రెడ్డికి కూడా సినిమా రంగంలో సంబంధం లేదు. నితిన్ , నిఖిల్ , కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.

ఇక సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ లో పెద్ద లిస్ట్ ఉంది…… ప్రేమికుల రోజుకు ఉదాహరణగా.