మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ” వాల్తేరు వీరయ్య ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. వాల్తేరు వీరయ్య ట్రైలర్ ఎలా ఉంటుందో అని చూసిన వాళ్లకు కనుల పండగే అని చెప్పాలి. ఎందుకంటే నిజంగానే మాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా కట్ చేసారు మరి.
మెగాస్టార్ చిరంజీవితో పాటుగా రవితేజ కూడా నటించాడు ఈ చిత్రంలో. ఇక ఈ ఇద్దరి మధ్య వార్ సాగనునట్లుగా చిన్న బిట్ కట్ చేసారు అది బాగుంది. చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంలోని డైలాగ్ ను రవితేజ చేత చెప్పించి అలాగే రవితేజ ఇడియట్ చిత్రంలోని డైలాగ్ ను చిరంజీవి చేత చెప్పించి పూనకాలు లోడింగ్ అనిపించేలా చేసారు మేకర్స్.
బ్రహ్మాండమైన విజువల్స్ , యాక్షన్ సీన్స్ వాల్తేరు వీరయ్య ను మరో లెవల్ లో నిలబెట్టింది అనే చెప్పాలి.మొత్తానికి చిరంజీవి చెప్పినట్లుగా ఇది రొటీన్ సినిమానే అయినప్పటికీ సంక్రాంతికి అభిమానులకు ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాను జనవరి 13 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. వాల్తేరు వీరయ్య ట్రైలర్ అభిమానులను అలరించేలా ఉంది.