33.1 C
India
Friday, April 26, 2024
More

    ఏంటి నాని.. ఇలా చంపేశావ్….?

    Date:

    What did you kill me like this
    What did you kill me like thisWhat did you kill me like this

    నేచురల్ స్టార్ నాని దసరా మూవీ బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేసింది. సుకుమార్ శిష్యుడిగా శ్రీకాంత్ ఓదెల తనదైన మార్క్ చూపించాడని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. శ్రీరామనవమి రోజున.. దసరా పండగను థియేటర్లోకి తీసుకొచ్చాడు నాని. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన దసరా.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.అంతేకాక ఇప్పటికి ఇండస్ట్రీలో దసరా మేనియా కొనసాగుతోంది. విడుదలై 10 రోజులైనా కూడా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన దసరా మూవీ నాని కెరీర్ లోనే ఊరమాస్ చిత్రంగా నిలిచిపోతుంది. ఇక నాని మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దసరా మూవీ చూసిన మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే కాంప్లిమెంట్ ఇవ్వడంతో పాటు తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వైరల్ గా మారింది.

    రీసెంట్ గా దసరా మూవీ చూసిన చిరంజీవి… నాని నటనకు ఫిదా అవ్వడంతో ప్రశంసల జల్లు కురిపించాడు. డియర్ నాని.. దసరా సినిమా చూశాను. చాలా గొప్ప సినిమా ఇది. నీ నటన చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరు చాలా బాగుంది. అసలు ఇది శ్రీకాంత్ ఓదెలకు తొలి సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను. చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. మా మాహానటి కీర్తి సురేష్ యాక్టింగ్ అదిరిపోయింది. దీక్షిత్ శెట్టి కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అదిరిపోయింది. మొత్తంగా టీమంతా కలిసి గొప్ప చిత్రాన్ని ఇచ్చారు అని చిరంజీవి మెచ్చుకున్నారు.ప్రస్తుతం చిరు ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

    చిరంజీవి ట్వీట్‌కి నాని స్పందించారు. మీరెప్పటికీ మా మెగాస్టారే సార్. వెండితెర మీద మాత్రమే మెగాస్టార్ కాదు.. సినిమా కోసం, సినిమా వాళ్ల కోసం ఎల్లప్పుడూ నిలబడే మెగా హార్ట్ మీ సొంతం’ అని నాని రిప్లై ఇచ్చాడు. ఇటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా చిరు ట్వీట్‌కి స్పందించారు. ‘ఇంద్ర’ సినిమాలో ‘దాయిదాయి దామ్మా’ పాటకు తన చిన్నప్పుడు వేసిన వీణ స్టెప్ ఫొటోతో రిప్లై ఇచ్చిన శ్రీకాంత్.. ‘ఎగురుతున్నా, థాంక్యూ బాస్’ అని రిప్లై ఇచ్చారు. మొత్తానికి చిరు నాని ట్వీట్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

    Share post:

    More like this
    Related

    Infosys Narayanamurthy : అనారోగ్యంతో ఉన్నా.. ఓటు వేసిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

    Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా...

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో రైతు కుమారుడు ఆల్ ఇండియా నెం.1

    JEE Mains : జేఈఈ మెయిన్స్ లో ఓ రైతు కుమారుడు...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...

    MLA Harish Rao : స్పీకర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా లేఖ

    MLA Harish Rao : ఈరోజు శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే హరీష్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...

    Anji Child Artist : ‘అంజి’లో చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్న చిన్నారి ఎవరో చెప్పండి?

    Anji Child Artist : బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఈ చిన్నారి...