Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హిరోలతో నటించి అభిమానులకు దగ్గరైంది. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులో నాగ చైతన్య తో కలిసి నటించింది. ముకుంద సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ వరుణ్ తేజ్ పక్కన యాక్ట్ చేసింది. 2010 సంవత్సరంలో ప్రపంచ సుందరి పోటీల్లో భారత్ నుంచి పోటీలో నిలిచింది. కానీ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పూజ మోడలింగ్ రంగంలో విశేషంగా రాణించింది.
2102 లో తమిళంలో లో మొదటి మూవీ చేసింది. అనంతరం వరుస గా తెలుగులో అగ్ర హిరోల సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం పూజా హెగ్డే పెళ్లికి సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. పూజా హిందీ బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్ర తో ప్రేమలో పడిందని వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని రూమర్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు రావడంతో రూమర్స్ కు మరింత ఊతమిచ్చినట్లయింది.
పూజా హెగ్డె తన కుటుంబంతో కలిసి ఒక రెస్టారెంట్ లో ఉన్న ఫొటోలు షేర్ చేయగా.. అందులో రోహన్ కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. త్వరలో వీరిద్దరూ ఒక జంటగా మారనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
రోహన్, పూజా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను చూసి వీరు పెళ్లి చేసుకుంటున్నారని వస్తున్న వార్తలకు ఇద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అన్సర్ ఇవ్వలేదు. దీంతో వీరి ప్రేమ, పెళ్లి నిజమేనని సోషల్ మీడియా కోడై కూస్తుంది. తెలుగులో ప్రస్తుతం పూజాకు సినిమాలు తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చక్కా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని ఈ బ్యూటీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి పూజా హెగ్డె అనౌన్స్ మెంట్స్ కోసం ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు, ఎక్కడ పెళ్లి అనేది తెలుపుతుందా.. లేక సీక్రెట్ గా చేసుకుంటుందా చూడాలి.