31 C
India
Monday, April 29, 2024
More

    సింగర్ యశస్వి చీటింగ్

    Date:

    controversy on singer yashaswi
    controversy on singer yashaswi

    సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న యశస్వి అనూహ్యంగా చీటింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు. నవసేవ  అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి నాలుగేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని , ఆ సంస్థలో దాదాపు 56 మందిని చదివిస్తున్నానని ఇటీవల ఓ షోలో పేర్కొన్నాడు. అదే వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. నవసేవ అనే సంస్థకు సింగర్ యశస్వికి ఎలాంటి సంబంధం లేదని , అది నేను కొంతమంది ఆర్థిక సహకారంతో నడిపిస్తున్నానని మీడియా ముందుకు వచ్చింది ఫరా కౌసర్.

    మా స్వచ్ఛంద సంస్థతో సంబంధం లేకుండా , మా సంస్థకు ఆర్ధిక సహకారం చేయకుండా నేను 56 మందిని చదివిస్తున్నానని ఎలా చెప్పుకుంటాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఫరా కౌసర్. ఈ విషయం తెలిసి పలువురు సింగర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యశస్వి ఇలా ఎందుకు చేసాడు ……. చేయని పనులను చేస్తున్నట్టుగా ఎందుకు చెప్పుకున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఇంత రాద్ధాంతం జరుగుతున్నా సింగర్ యశస్వి మాత్రం నోరు మెదపడం లేదు ……. వివరణ ఇవ్వడం లేదు దాంతో మరిన్ని ఆరోపణలు వస్తున్నాయి. సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న యశస్వి అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నాడని , చేయని పనులను గొప్పకు పోయి చెప్పుకుని అబాసుపాలయ్యాడని నవ్వుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    వివాదంపై స్పందించిన సింగర్ యశస్వి

    ప్రముఖ నేపథ్య గాయకుడు యశస్వి తనపై వస్తున్న వివాదాస్పద అంశంపై ఎట్టకేలకు...