34.1 C
India
Monday, April 29, 2024
More

    చిరుతో డీజే టిల్లు.. త్వరలో గ్రేట్ కాంబో..

    Date:

    Siddu-Jonnalagadda-to-Act-With-Chiranjeevi
    Siddu-Jonnalagadda-to-Act-With-Chiranjeevi
    ఎవరెస్ట్ అంత మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినిమాల్లోనే కాదు వ్యక్తి గతంగా కూడా చాలా ఉన్నతమైన వ్యక్తి. సినిమాను తన కుటుంబంగా భావించే మెగాస్టార్, ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తుంటాడు. తనతో సమానమైన వ్యక్తితో పని చేయడంలోనూ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన జూనియర్స్ తోనూ కలిసి పని చేయడంలోనూ ఆయన ఉత్సాహం చూపుతుంటారు. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ విషయానికి వస్తే మెగాస్టార్ ఫైట్లు చేయడమే కాదు నవ్వులు కూడా పూయిస్తారు. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో ఆయన నవ్వులు పూయించారు. సీరియస్ గా సాగే మూవీల్లో సైతం సందర్భాన్ని బట్టి కామెడీ పంచ్ లతో ఆడియన్స్ ను అలరించారు ఆయన. అగ్రహీరోలతో పోల్చితే ఆయన కామెడీ టైమింగ్ ఆయన సమకాలీకుల్లో ఎవ్వరిలోనూ లేదనిపిస్తుంది. చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’లో ఆయన సీరియస్ నెస్ కంటే కామెడీతోనే హిట్ కొట్టారనిపిస్తుంది.

    ‘డీజే టిల్లు’తో కుర్రకారును తన వైపునకు తిప్పుకున్నారు సిద్ధు జొన్నలగడ్డ. గతంలో ఆయన చేసిన కొన్ని సినిమాలు మూస ధోరణిలో వెళ్లినా ‘డీజే టిల్లు’ ఆయన కెరీర్ ను ఒక మలుపుతిప్పింది. సినిమా రిలీజై ఏడాది పూర్తయినా ‘నువ్వు నన్ను అడుగుతున్నావా రాధిక’ అంటూ సాగే డైలాగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారంటే ఆడియన్స్ లో దీని క్రేజ్ ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. అయితే చిరంజీవి, జొన్నలగడ్డ సిద్ధు కాంబోలో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు చిత్రవర్గాల నుంచి లీకులు వినిపిస్తున్నారు. అగ్రహీరోతో అప్ కమింగ్ హీరో ఈ వార్త చాలా క్రేజ్ గా ఉందని ఆడియన్స్ ఇప్పటికేఈ కాంబో కోసం ఎదురు చూస్తున్నారు. చిరు కామెడీ టైమింగ్, సిద్ధు టైమింగ్ ఈ రెండూ కలిస్తే థియేటర్ థియేటర్ అంతా నవ్వులే నవ్వులు..

    డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఇటీవల చిరంజీవికి ఒక కథ చెప్పారట. అయితే కథ ప్రకారం ఇందులో ఒక యువ హీరో కూడా ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం సిద్ధు జొన్నలగడ్డను తీసుకుందామని చిరంజీవినే డైరెక్టర్ కు సజెష్ చేశారట. ఊహించని విధంగా చిరంజీవి సిద్ధు పేరును సూచించడడంతో కళ్యాణ్ కృష్ణ ఆశ్చర్యపోయారట. దీనిపై సిద్ధును కూడా సంప్రదిస్తే మెగాస్టార్ తో చేసేందుకు అవకాశం ఎవరు వదులుకుంటారని ఒకే చెప్పారట. అయితే ఈ చిత్రానికి ‘ధమాకా’ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఆయన కథలన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ తో కూడినవే. ఈ కాంబోను వెండితెరపై చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు మరి. ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube Director : టిల్లూ ఫ్రాంచైజీ నుంచి కొత్త న్యూస్.. ‘టిల్లు క్యూబ్’కు డైరెక్టర్ ఇతనే..

    Tillu Cube Director : 2022 ప్రీక్వెల్ ‘డీజే టిల్లు’ మార్కును...

    Siddu Jonnalagadda : జొన్నలగడ్డ సిద్దు వైపు చూస్తున్న సినీ నిర్మాతలు

    Siddu Jonnalagadda : థియేటర్లో తెరపై సినీ హీరో జొన్నలగడ్డ సిద్దు...

    Tillu Cube : టిల్లు క్యూబ్ తో అట్లుంటదట మరి!

    Tillu Cube : డీజే టిల్లు విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు...

    Sidhu Jonnalagadda : సిద్ధూ జొన్నలగడ్డ.. లీగ్ మారిపోయింది..

    Sidhu Jonnalagadda : రంగుల ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ, దేనికి సక్సెస్...