33.4 C
India
Friday, May 3, 2024
More

    Sharmila : షర్మిలపై మరో కేసు..!

    Date:

    Sharmila
    Sharmila, YSRTP-Congress

    Sharmila : వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌పై మ‌రో కేసు న‌మోదైంది. ఆమెపై వివిధ సంద‌ర్భాల్లో కేసులు న‌మోదయ్యాయి. చివ‌రిగా లోట‌స్‌పాండ్‌లోని త‌న ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్తున్న ష‌ర్మిల‌ను పోలీసులు అడ్డుకోవడంతో వారిపై చేయి చేసుకుంది. ఈ కార‌ణంతో కేసు న‌మోదైంది. తాజాగా టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ స‌ర్కార్‌పై మీడియా స‌మావేశాల్లో, సోష‌ల్ మీడియాలో దూష‌ణ‌ల‌కు దిగడంతో కేసు న‌మోదైంది.

    ముఖ్యమంత్రి కేసీఆర్‌పై Sharmila ధూష‌ణ‌ల‌కు దిగడంతో కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నేత నరేందర్ యాదవ్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 505(2), 504 సెక్షన్ల కింద కేసు పెట్టారు. అయితే ష‌ర్మిల‌ను బీఆర్ఎస్ స‌ర్కార్ ఎక్కడిక్కడే కట్టడి చేస్తోంది. గతంలో షర్మిల పాదయాత్రలు నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు, ప్రభుత్వంపై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది.

    న్యాయ‌ పోరాటం చేసి కోర్టు నుంచి అనుమ‌తి తెచ్చుకున్నప్పటికీ అడుగులు ముందుకు వేయ‌లేని పరిస్థితి ఆమెది. నోరు తెరిచినా.. అడుగేసినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. మ‌రోవైపు కేసీఆర్ ప్రభుత్వానికి టార్గెట్ కాదని తెలిసినా, ప్రజల్లో ష‌ర్మిల పార్టీకి త‌గిన ఆద‌ర‌ణ లేకున్నా కేసులు పెట్టి ఆమెను ఎందుకు హైలెట్ చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.

    ష‌ర్మిల‌ను ఆంధ్రా నాయ‌కురాలిగానే ఇక్కడి పౌర స‌మాజం చూస్తుంద‌నేందుకు, వైఎస్సార్‌టీపీ బ‌ల‌ప‌డ‌డడం లేదు. కేసుల‌తోనే ష‌ర్మిల‌కు సమయం సరిపోతోంది. ఇక ఆమె రాజ‌కీయాలు ఎప్పుడు చేయాలి..? ఎలా చేయాల‌నేది..? తెలియడం లేదు. ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టడానికే ష‌ర్మిల‌కు సమయం స‌రిపోతోంది. క్షేత్ర స్థాయినలో ప్రజలను క‌లుసుకునేందుకు అనుకూల వాతావ‌ర‌ణం లేద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Pension : ఏపీలో 4న ఇంటింటికీ పింఛను

    Door To Door Pension : బ్యాంకులో ఖాతాలు బ్లాక్ అయి...

    Leopard : హమ్మయ్య.. చిరుత చిక్కింది

    Leopard Trapped : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన...

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Who Is Jagan : ఇంతకీ జగన్ ఎవరు? అర్జునుడా..? అభిమన్యుడా..? కుంభకర్ణుడా..?

    Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని...

    YS Sharmila : కొంగుచాచి అడిగింది.. గెలుపు కోసం పాపం షర్మిల దిగజారింది..

    YS Sharmila : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు...