36.1 C
India
Saturday, May 4, 2024
More

    Avinash Reddy-CBI : మరో‘సారీ’ రాలేను అంటున్న అవినాష్..!

    Date:

    Avinash Reddy-CBI
    Avinash Reddy-CBI

    Avinash Reddy-CBI : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐకి జలక్ ఇచ్చారు. ఇది మూడోసారి కావడం గమనార్హం.  ఇప్పటికే వరుసగా 16,19 తేదీల్లో సీబీఐ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా, ఆయన వివిధ కారణాలతో రాలేదు. అయితే 22న విచారణకు రావాలని మూడోసారి సీబీఐ నోటీసులు ఇవ్వగా తాను రాలేనని అవినాష్ సీబీఐకి సమాచారం అందించారు. హైదారాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఆయన సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ప్రస్తుతం ఆయన కర్నూలులోనే ఉన్నట్లు సమాచారం.

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నారు. అయితే ఇప్పటికే సీబీఐ ఐదుసార్లు ఆయనను ప్రశ్నించింది. ఇక 16, 19 తేదీల్లో రావాలని పిలిచినా, ఆయన హాజరుకాలేదు. ఈనెల 19న తన తల్లికి గుండెపోటు వచ్చిందని, దవాఖానలో తన వెంట ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే సీబీఐ ఈనెల 22 సోమవారం విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చింది. తన తల్లి ఆరోగ్యం బాగయ్యేంతవరకు తాను రాలేనని, పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన సీబీఐని కోరారు. అయితే అవినాష్ విషయంలో ఇప్పటికే సీరియస్ గా ఉన్న సీబీఐ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.

    అరెస్ట్ ఖాయమనే అనుమానంతోనే అవినాష్ సీబీఐకి ఎదురపడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి సీబీఐ ఇలా నోటీసులు ఇస్తూనే వెళ్తుందా.. లేదంటే రెండు, మూడు రోజుల సమయం ఇస్తుందా.. లేక అదుపులోకి తీసుకుంటుందా అనేది సోమవారం తెలియనుంది. ఇప్పటికే ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం కూడా అవినాష్ రెడ్డి తీరును సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dastagiri Petition : జగన్ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించoడి : సిబిఐ కోర్టులో దస్తగిరి పిటిషన్

    Dastagiri Petition : హైదరాబాద్: మాజీమంత్రి వివేక హత్య కేసులో అప్రూవర్...

    MP Avinash Reddy : మరోసారి సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి

    MP Avinash Reddy : వైఎస్ వివేకానంద హత్య కేసులో విచారణ...

    Relief to Avinash : అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఊరట..

    Relief to Avinash : వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Avinash Bail Petition : నేడే అవినాష్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు!

    Avinash bail petition : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు...