38.3 C
India
Thursday, May 2, 2024
More

    Old alliance : పాత పొత్తు కుదిరేనా ?

    Date:

    Old alliance
    Old alliance, tdp bjp janasena

    Old alliance : 2019 లో దూరమైన టీడీపీ, బీజేపీ మళ్లీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో పొలిటికల్ హీట్ ఇప్పటికే జోరందుకుంది. సీఎం జగన్ ను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధితనే పవన్ అడుగులు వేస్తున్నారని ఇప్పటికే రూమర్లు వస్తున్నాయి.  కాగా పవన్ కల్యాన్ బీజేపీతో తన మైత్రి కొనసాగిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చాడు. ఈ క్రమంలో టీడీపీతో పొత్తుతో పవన్ బీజేపీని ఒప్పిస్తారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తున్నది. కానీ, బీజేపీ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నది. అదే సమమయంలో ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ కూడా కేంద్రంలోని బీజేపీ పై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. అటు కాంగ్రెస్ కూటమితోనూ, ఇటు కేసీఆర్ కూటమితోనూ నేరుగా కలవడం లేదు. తన రాజకీయ భవిష్యత్ను పూర్తిగా ఏపీకే పరిమితం చేసుకున్నాడు. అయితే టీడీపీ, జనసేన పొత్తు ఏ మేరకు ఫలిస్తుందో కొద్ది రోజుల్లో తేలనుంది.

    కేంద్రం నుంచి జగన్ కు మద్దతు ? 

    మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో కేంద్రం నుంచి కూడా జగన్ మద్దతు ఇస్తున్నట్లుగానే కనిపిస్తున్నది. పాలనా పరంగా ముఖ్యమంత్రి జగన్ కు ఆర్థిక నిర్వహణ సమస్య ఎదురవుతున్నది. ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇతర హామీలు..బిల్లుల విడుదల చేయక తప్పదు. ఈ విషయమై  ప్రధానితో సీఎం జగన్ వీలైనన్నీ సార్లు కలుస్తున్నారు. ఏపీకి సాయం అందించాలని కోరుతున్నారు.

    అయితే  ఏపీకి సాయం అందించే విషయంలో  ప్రధాని సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రూ. 32 వేల కోట్ల మేర రుణాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో ఏపీకి రావాల్సిన రెవిన్యూ లోటు నిధుల కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఎంతగా ప్రయత్నించినా ఆమోదించని  చెప్పని కేంద్రం..ఇప్పుడు సీఎం జగన్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందిచింది.

    పొత్తుపై కసరత్తులు..

    ఆర్థిక లోటు నేపథ్యంలో సీఎం జగన్ కు సంక్షేమ పథకాల అమలు కత్తిమీద సాముగా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగుల బకాయిలు..కాంట్రాక్టర్ల చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, నిర్వహణ ఖర్చుల భారం సమస్యగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన ఏపీ టీడీపీ అధికార పార్టీపై రాజకీయంగా దాడిని ఉదృతం చేసింది. ఎన్నికల సమయంలోనూ కేంద్రం నుంచి సాయం లేకుండా చూడాలని శత విధాలా ప్రయత్నిస్తున్నది.

    పవన్ ప్రతిపాదనకు బీజేపీ సానుకూలం.?

    రానున్న ఎన్నికల్లో జనసే, బీజేపీ కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనను పవన్ కల్యాణ్ బీజేపీ ముందుంచాడు. పవన్ నేరుగా ఆ పార్టీ ముఖ్యులతో ఈ ప్రతిపాదన పై ఇప్పటికే చర్చలు జరిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంంలో పవన్ ప్రతిపాదన కు  బీజేపీ అంగీకరించక తప్పకపోవచ్చు.  పొత్తుల వ్యవహారం పై బీజేపీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సీఎం జగన్ కేంద్రానికి  అన్ని విధాల మద్దతు ఇస్తున్నారనే విషయం తెలిసిందే. ఏపీలో పార్టీని విస్తరించాలనేది బీజేపీ లక్ష్యం. పవన్ తో బీజేపీ పొత్తు ఉన్నా, టీడీపీతో అలయన్స్ విషయంలో మాత్రం కమలం నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

    పవన్ బీజేపీని విభేదిస్తాడా..?

    తనతో పొత్తు కొనసాగిస్తూనే జగన్ తో సన్నిహితంగా ఉండడం పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడనే రూమర్లు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పవన్ బీజేపీని విభేదిస్తాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ప్రస్తుతం రెండు పార్టీల్లో నూ చర్చ సాగుతున్నది. దీంతో  బీజేపీ నిర్ణయం ప్రకటించే వరకూ చంద్రబాబు – పవన్ వేచి చూస్తారా లేక, ఈ రెండు పార్టీలే పొత్తును అధికారికంగా ప్రకటిస్తాయా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    Vangaveeti Radha : వంగవీటి రాధాకు ఏమైంది? ఎందుకీ దుస్థితి?

    Vangaveeti Radha : విజయవాడ అంటేనే వంగవీటి రాధా గుర్తుకు వస్తారు....

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...