38.3 C
India
Sunday, May 5, 2024
More

    Telangana EAMCET Results : తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్.. ఎంత మంది పాసయ్యారంటే..

    Date:

    Telangana EAMCET Results : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు గురువారం (మే 25) రోజున విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 9.30 గంటలకు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్ అండ్ మెడికల్ 86 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ రిజల్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే మొదటి స్థానాలు సాధించారు. ఇంజినీరింగ్ టాప్ 10, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ టాప్ 10 లో ఏడుగురు వారే ఉన్నారు.

    ఎంసెంట్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 94,589 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 20,743 మందితో కలిపి మొత్తం 1,15,332 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,01,544 మంది హాజరవగా 13,788 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు 91,935 మంది. ఉత్తీర్ణతా శాతం 86, అందులో బాలురు 84, బాలికలు 87 శాతంగా ఉంది.

    ఇక ఇంజినీరింగ్ విభాగంలో చూసుకుంటే.. పరీక్ష రాసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి 1,53,890 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 51,461 మందితో కలిపి మొత్తం 2,05,351 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,95,275 మంది హాజరవగా 10,076 మంది గైర్హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు 1,57,879 మంది. ఉత్తీర్ణతా శాతం 80గా ఉంది. ఇందులో బాలురు 79, బాలికలు 82 శాతంగా ఉంది.

    ఇంజినీరింగ్ టాపర్లు
    సనపల అనిరుధ్ (విశాఖపట్నం)
    ఎక్కింటిపాని వెంకటమణిందర్ రెడ్డి (గుంటూరు)
    చల్లా ఉమేశ్ వరుణ్ (నందిగామ)
    మాజేటి అభినీత్ (కొండాపూర్)
    పొన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి (తాడిపత్రి)
    మారదాన ధీరజ్ కుమార్ (విశాఖపట్నం)
    వడ్డే శాన్వితా రెడ్డి (నల్గొండ)

    అగ్రికల్చల్ అండ్ మెడిసిన్ లో టాపర్లు
    బూరుగుపల్లి సత్యారాజ జశ్వంత్ (తూ.గో జిల్లా)
    నశిక వెంకటతేజ (చీరాల)
    పఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్ నగర్)
    దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
    బోర వరుణ్ చక్రవర్తి (శ్రీకాకుళం)
    దేవగుడి గురుశశిధర్ రెడ్డి (హైదరాబాద్ )
    వంగీపురం హర్షిల్ సాయి (నెల్లూరు)

    రిజల్ట్స్ తెలుసుకునేందుకు
    http://www.results.manabadi.co.in/2023/TS/EAMCET/Telangana-EAMCET-Results-Engineering-May-2023.htm లో చూడండి.

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related