31.9 C
India
Monday, May 6, 2024
More

    Director Srikanth Addala : మరోసారి గోదావరి యాస..?

    Date:

    Director Srikanth Addala
    Director Srikanth Addala

    Director Srikanth Addala : తెలుగు సినిమాలకు విచిత్ర  టైటిళ్లు పెట్టడం దర్శకుడు జంధ్యాల ముందుంటారు. ఆ తర్వాత ఆ మార్క్ చూపింది సినీయర్ దర్శకుడు వంశీ, ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు కొత్త కొత్త టైటిళ్లు పెట్టినా అది ఒకటి, రెండు సినిమాలకే పరిమితమయ్యారు. పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయారు. ప్రస్తుతం టీ టౌన్ లో టైటిళ్ల పై మరోసారి చర్చ జరుగుతున్నది.

    లేటెస్ట్ గా ఓ టైటిల్ వినిపిస్తున్నది అయితే అది నిజమో కాదో ఇంకా స్పష్టత రాలేదు. కానీ చర్చ మాత్రం జరుగుతున్నది. కుల రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్. పెదకాపు టైటిల్ తో ఓ సినిమా రాబోతున్నదని, దానికి నిర్మాత  అదే రాష్ర్టానికి చెందిన నిర్మాత రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అని. టైటిల్ కొంత ఆసక్తిగా ఉన్నా ఇప్పటికైతే పూర్తి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. జయజయ జానకీ నాయక, అఖండ లాంటి మంచి సినిమాలు తీసిన మిరియాల రవీందర్ రెడ్డి మరో సినిమాను నిర్మించబోతున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. శ్రీకాంత్ అడ్డాల పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ తీశాడు.

    ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో నారప్ప మినహా అన్నీ కుటుంబ కథా చిత్రాలే. నారప్ప తమిళ రీమేక్. సినిమాలో హీరో రఫ్ లుక్ ఉన్నా ఎక్కడా అసభ్యత కు తావు లేదు. పైగా ఆయన సినిమాల్లో పక్కా గోదావరి జిల్లాల యాస, కథలు కనిపిస్తాయి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల తన సినిమాకు పెదకాపు అని పెట్డడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతునన్నది. అయితే ఈ టైటిల్ ఫిక్స్ సినిమా కూడా గోదావరి జిల్లాల నేపథ్యంలో ఉంటుందనే పలువురు చర్చించుకుంటున్నారు.

    ఈ సినిమా హీరో ఎవరు అన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. మిరియాల రవీందర్ రెడ్డి సమీప బంధువు హీరోగా చేయబోతున్నట్లు గా తెలుస్తున్నది. ఇంతకీ ఎవరా హీరో, టైటిల్ కరెక్టేనా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Srikanth Addala : శ్రీకాంత్ అడ్డాల న్యూ మూవీ.. పస్ట్ లుక్ పోస్టర్ వేరే లెవల్..!

    Srikanth Addala : ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె...