39.5 C
India
Thursday, May 2, 2024
More

    చిరంజీవిని బీజేపీ రాజకీయంగా వాడుకోనుందా ?

    Date:

     

    is bjp eyes on chiranjeevi
    is bjp eyes on chiranjeevi

    మెగాస్టార్ చిరంజీవిని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాడుకోవాలని భావిస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అందులో భాగంగానే వీలు కుదిరినప్పుడల్లా చిరంజీవిని అభినందించడం , సన్మానించడం జరుగుతూ వస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి ప్రస్తావన రాగా తాజాగా మరోసారి చిరంజీవిని ” ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 ” అవార్డుకు ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీ చిరంజీని ప్రశంసిస్తూ తెలుగులో ట్వీట్ చేయడం విశేషం.

    ఏకంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేయడంతో చిరంజీవి పరవశించి పోతున్నాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చి విఫలమైన చిరంజీవి మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్ళేది లేదని ఖరాకండిగా చెబుతూనే ఉన్నాడు. అయితే క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని , భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎన్నికల్లో మద్దతు ఇస్తే సరిపోతుందనే భావనతో ఉన్నారట బీజేపీ నాయకులు.

    ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి ఆ తమ్ముడికి అన్న మెగాస్టార్ మద్దతు ఇస్తే ……. 2024 ఎన్నికల్లో చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తే ….. ఏమో గుర్రం ఎగరా వచ్చు అన్న చందంగా అద్భుత ఫలితాలు సాధించకపోతామా ? అనే ఆశల పల్లకిలో ఊగుతున్నారట కాషాయ దళాలు. అయితే చిరంజీవి మాత్రం రాజకీయాలు అంటేనే భయపడిపోతున్నాడు పాపం ప్రజారాజ్యం తెచ్చిన తలవంపులను తల్చుకుంటూ. 

    Share post:

    More like this
    Related

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    Asaduddin Owaisi : జగన్ కు ఆ పార్టీ మద్దతు.. చంద్రబాబు.. పవన్ పై ఫైర్ అయిన పార్టీ అధినేత..

    Asaduddin Owaisi : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని ముఖ్యమైన పార్టీ...

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతి: జేపీ నడ్డా

    JP Nadda : అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని బీజేపీ...

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...