టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటి జమున (86) మృతి చెందారు. 60- 70 వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జమున తిరుగులేని స్టార్ డం ను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ , శోభన్ బాబు తదితర స్టార్ హీరోల సరసన నటించిన జమున ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. జమున మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.