Venkaiah Naidu in New York : మాజీ ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తానా సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు తాజాగా న్యూయార్క్ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయం వద్ద తానా ప్రతినిధులు, ప్రవాసీ భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జడ్పీ మాజీ ఛైర్మన్ పాతూరి నాగభూషణం, మన్నవ సుబ్బారావు, యూబ్లడ్ ఛైర్మన్ యలమంచిలి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు భాషాభిమాని అయిన వెంకయ్య నాయుడు తనదైన శైలిలో చలోక్తులు విసురుతూ.. మన సంప్రదయాలను కాపాడుకోవాలని పిలుపునిస్తుంటారు. గతంలో ఇందుకు సంబంధించిన పలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న తానా మహాసభల్లో వెంకయ్య నాయుడు ఏం మాట్లాడుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.