
మెగా అభిమానులకు ఎట్టకేలకు శుభవార్త తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. తన కొడుకు చరణ్ , కోడలు ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించాడు. ఉపాసన – చరణ్ లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరి పెళ్లి 2012 లో పెళ్లి జరిగింది. ఇక అప్పటి నుండి చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారు ? అంటూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నారు.
చరణ్ కంటే ముందు అలాగే చరణ్ తర్వాత పెళ్లి చేసుకున్న పలువురు స్టార్ హీరోలు ఎంచక్కా పిల్లలను కన్నారు ……. వాళ్లతో ఆడుకుంటున్నారు కూడా. కానీ చరణ్ – ఉపాసన మాత్రం పిల్లల విషయంలో తొందరపడటం లేదని అసంతృప్తికి లోనయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవిని అయితే మీడియా కూడా పలుమార్లు ప్రశ్నించింది ఈ విషయంలో. పాపం ….. దానికి ఏం చెప్పాలో తెలియక అది పిల్లల ఇష్టం దానికి మేము ఏం చేయగలం అంటూ నిట్టూర్చారు. కట్ చేస్తే ఇన్నాళ్లకు మెగా అభిమానులకు శుభవార్త చెప్పడంతో పులకించిపోవడం ఖాయం. ఇక మెగాస్టార్ ఆనందానికి అయితే అవధులు లేవు అనే చెప్పాలి. ఎందుకంటే పదేళ్ల నుండి వారసుడి నుండి వారసుడు కావాలని కోరుతున్నాడు మరి.
View this post on Instagram