Jai Balayya : అమెరికాలో తానా మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. ఈ వేడుకల కోసం నందమూరి తారక రామరావు కుమారుడు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా బాలకృష్ణ ఇటీవల న్యూజెర్సీకి ఫైట్ జర్నీ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణను ప్రిన్స్టన్ కు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ రవి కలుసుకున్నారు. వీరిద్దరు ఒకే ఫైట్లో ప్రయాణం చేశారు. పక్క పక్క సీట్లో కూర్చోని వీరిద్దరు కాసేపు చిట్ చాట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టార్ హీరో బాలకృష్ణతో ఒకే ఫైట్లో ప్రయాణిస్తూ చిట్ చాట్ నిర్వహించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్ఆర్ఐ రవి తెలిపారు.