
Sidda Ramaiah CM : కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఆయన నివాసం వద్ద పోలీస్ ప్రొటెక్షన్ పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాలుగు రోజులుగా నానుతున్న వ్యవహారానికి తెరపడినట్లయింది. అయితే సీఎం పదవి కోసం డీకే శివకుమార్ ఎంతో ట్రై చేశారు. కానీ ఆయనకు డిప్యూటీ సీఎం, రెండు కీలక శాఖలను అప్పటించి బుజ్జగించింది కాంగ్రెస్ అధిష్టానం.
ఎన్నికలు ముగిసి, విజేతలుగా ప్రకటించే వరకూ ముఖ్యమంత్రి పీఠంపై నువ్వా..? నేనా..? అన్న కోట్లాట మొదలైంది. సిద్ధ రామయ్య కొడుకు తన తండ్రి సీనియర్ నేత అని గతంలో పాలించిన అనుభవం ఉంది కాబట్టి సిద్ధరామయ్యకే అప్పగించాలని కోరగా, అసలు పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు ఎంతో కృషి చేసింది తన అన్న కాబట్టి ఆయనకే సీఎం కట్టబెట్టాలని ఇరు వర్గాల మధ్య వాదనలు నడిచాయి. గెలుపు ప్రకటించిన మరుసటి రోజు ఫ్లెక్సీల వార్ కూడా ఇరు వర్గాల మధ్య నడించింది.
అయితే అధిష్టానం ఇద్దరినీ బెంగళూర్ పిలిచింది. అక్కడ మాట్లాడిన తర్వాత ఫైనల్ చేసింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని, డిప్యూటీ సీఎంతో పాటు మరో రెండు కీలక శాఖలకు డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వహిస్తారన్నారు ఇందుకు చర్చలను సఫలీకృతం చేయడంలో కాంగ్రెస్ విజయం సాధించిందనే చెప్పాలి. అయితే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రేపు (మే 18) సాయంత్రం 3.30 గంటలకు కన్నడ కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమైన నేతలు, ప్రముఖులు హాజరవుతారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది అక్కడి ప్రభుత్వం.