
Blue Whale : చేపల్లో పెద్దది తిమింగలం. అది చిన్న చిన్న చేపలను సైతం మింగుతుంది. అంత భారీ ఆకారం కలిగిన తిమింగలం చనిపోయి కేరళలోని సముద్రతీరానికి కొట్టుకొచ్చింది. కేరళలోని కోజికోడ్ బీచ్ లో ఈ తిమింగలం చనిపోయి పడి ఉంది. దీంతో జనం తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు. భారీ ఆకారం కావడంతో ప్రజలు పెద్ద మొత్తంలో గుమిగూడారు.
కానీ అది పేలుతుందనే భయంతో చాలా మంది దూరంగా ఉండి చూస్తున్నారు. చనిపోయిన తిమింగలం ఫొటోలు, వీడియోలు, సెల్ఫీలు తీస్తూ సందడి చేస్తున్నారు. కేరళలోని కోజికోడ్ బీచ్ కు సుమారు 50 అడుగుల పొడవైన చనిపోయిన బ్లూ వేల్ కొట్టుకొచ్చింది. శనివారం ఉదయం 10.15 గంటలకు స్థానికంగా ఉండే జాలర్లు గమనించి అధికారులకు సమాచారం అందజేశారు.
తిమింగలం చనిపోయి రెండు రోజులు అయిందని తెలిపారు. దాని కళేబరాన్ని పరిశీలించిన అధికారులు అది చనిపో యి రెండు రోజులు అవుతుందని గుర్తించారు. దాని మరణానికి కారణాలు తెలుసుకునేందుకు పోస్టుమార్టం నిర్వమించారు. ప్రొటోకాల్ ప్రకారం దానిని అక్కడే పాతిపెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నారు. తిమింగలం చనిపోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.
తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్ కళేబరం ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలుస్తున్నాయి. నిజాముద్దీన్ అనే యూజర్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో కళేబరం వద్దకు వెళ్లొద్దని అది పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. దీంతో చాలా మంది దూరం నుంచే దాన్ని చూస్తూ వెళ్లిపోతున్నారు.