New York : అమెరికాలో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే సాయంత్రం సమయంలో సబ్ వే వద్ద కాల్పులకు తెగబడ్డారు. న్యూయార్క్‌లో (New York) గల బ్రోంక్స్ సబ్ వే స్టేషన్ వద్ద సోమవారం ఓ ఆగంతకుండు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నారు. మరికొందరు ఆఫీసుకు వెళ్లేందుకు సబ్ వే స్టేషన్ వద్దకు వచ్చారు.
దీంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంది. ఆ సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. అతను జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన ఆగంత కుడు అక్కడి నుంచి పారిపోయాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు