Nandamuri Taraka Rama Rao : తెలుగు జాతి రత్నం, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి ఆయనో ప్రతీక. రాష్ర్ట ముఖ్యమంత్రిగా నటుడిగా తనదైన ప్రస్థానం కొనసాగించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన అకుంఠిత దీక్షా పరుడు.ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో మన రామారావుకు నివాళులర్పించారు. ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. ప్రముఖుల సమక్షంలో ఎన్టీఆర్ ఘనతను కొనియాడారు. ఆ రాష్ట్ర ప్రీమియర్ డానియల్ ఆంట్రూస్ తెలుగువారి గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ కీర్తించారు. మెల్ బోర్న్ లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ లో రాష్ట్ర పార్లమెంట్ ప్రతినిధుల సమక్షంలో వేడుకలు నిర్వహించారు.
భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ ప్రభావం గురించి ఘనంగా కీర్తించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. రాకీయాల్లో కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఆయన సొంతమని చాటారు. తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని శ్లాఘించారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ చేసిన కృషి అనిర్వచనీయం.
తెలుగు వారి ఖ్యాతి చాటడంలో ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిది. తెలుగు ప్రజలు ఆయన పట్ల ప్రేమ, ఆప్యాయత చూపారన్నారు. అనేక విజయాలు సొంతం చేసుకున్న అపర చాణక్యుడు. చారిత్రక పురుషుడని కొనియాడారు. ఇలా విక్టోరియా రాష్ట్రంలో ప్రతినిధులు మన తెలుగు వారిని కీర్తించడం నిజంగా గొప్ప విషయమే. మనకు గర్వకారణమే.
ReplyForward
|