Alia Bhatt : ఏ ఇండస్ట్రీ అయినా సరే ఇప్పుడు గ్లామర్ ఫీల్డ్ అనే అర్థం చేసుకోవాలి. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే హీరోయిన్లకు ముఖ్యంగా గ్లామర్ అనేది కంపల్సరీ. అది లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా సరే ఎవరూ ఛాన్సులు ఇవ్వరు. ఇక ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా సరే బాడీ షేమింగ్ అనేది ఇప్పుడు అందరు హీరోయిన్లను భయపెడుతోంది.
ఎంత ట్యాలెంట్ ఉన్నా, స్టార్ డమ్ ఉన్నా సరే ఈ బాడీ షేమింగ్ తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు హీరోయిన్లు. ఇలాంటి వారి లిస్టులో తాను కూడా ఉన్నానని చెబుతోంది ఆలియా భట్. నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన ఈ భామ ఇప్పుడు రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఓ పాపకు తల్లి కూడా అయింది. ఇక కూతురు పుట్టాక కూడా వరుసగా మూవీలు చేస్తోంది.
రీసెంట్ గానే రణ్ వీర్ సింగ్ తో ఓ సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఇక తాజాగా మరో మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె గతంలో తాను కూడా బాడీ షేమింగ్ ఎదుర్కున్నట్టు చెప్పింది. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను హీరోయిన్ మెటీరియల్ కాదంటూ కొందరు కామెంట్లు చేశారు.
కొందరు అయితే నా ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కామెంట్స్ చేశారు. నా ఎద సైజులు చిన్నగా ఉన్నాయంటూ బాడీ షేమింగ్ చేశారు. కానీ నేను వాటని ఎన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. మంచి పొజీషన్ కు వచ్చి అలాంటి వారికి సమాధానం చెప్పాలని అనుకున్నాను. అందుకోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. అదే నన్ను ఈ స్థాయిలో ఉంచింది అంటూ తెలిపింది ఆలియా భట్.