Mission Raniganj Trailer : అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’ అనే టైటిల్ నుంచి భారత్ అనే పదాన్ని మార్చారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఇంటెన్స్ రెస్క్యూ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
రాణిగంజ్ బొగ్గు క్షేత్రాల్లో చిక్కుకున్న 64 మంది మైనర్ల ప్రాణాలను కాపాడిన జస్వంత్ సింగ్ గిల్ చేపట్టిన రెస్క్యూ మిషన్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీలో అక్షయ్ కుమార్ ఈ రియల్ లైఫ్ హీరో పాత్రలో నటిస్తున్నాడు.
1989, నవంబర్ లో పశ్చిమ బెంగాల్, రాణిగంజ్‌లోని మహాబీర్ కాలరీస్‌లో జరిగిన ఘోర విషాదాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. వంద మందికిపైగా గని కార్మికులను వెంటనే రక్షించగా, 65 మంది మైనర్లు వరదనీటిలో చిక్కుకున్నారు. గిల్ బాధ్యతలు స్వీకరించి చిక్కుకున్న 65 మంది మైనర్లను రక్షించడానికి అద్భుతమైన ప్రణాళికను రూపొందించాడు.
అక్షయ్ కుమార్ నటించిన ‘రుస్తుం’ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు టిను సురేశ్ దేశాయ్ ‘మిషన్ రాణిగంజ్: ది గ్రేట్ భారత్ రెస్క్యూ’. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో పరిణీతి చోప్రా, కుముద్ మిశ్రా, పవన్ మల్హోత్రా, దిబ్యేందు భట్టాచార్య, ముఖేశ్ భట్, అక్షయ్ వర్మ, సుధీర్ పాండే నటించారు. అక్టోబర్ 6, 2023న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్ భారీ వ్యూవ్స్ తో దూసుకుపోతోంది. సినిమాపై భారీ హైప్ నెలకొంది.