41.2 C
India
Sunday, May 5, 2024
More

    Amma Karunamai : అమెరికాలో ‘అమ్మ కరుణామాయి’… అడుగడుగునా నీరాజనాలు..!

    Date:

    • కాలిఫోర్నియా లో భక్తిపారవశ్యంలో ఎన్నారైలు..
    Amma Karunamai
    Amma Karunamai

    Amma Karunamai : హిందూ ధర్మాన్ని దశ దిశలా ప్రచారం చేస్తూ అందులోని గొప్పతనాన్ని వివరిస్తూ పూజలందుకుంటుంది అమ్మ శ్రీ కరుణామయి మాతా. కలియుగంలో వెలిసిన అమ్మవారిగా ఆమెను భక్తులు కీర్తిస్తుండగా వారికి ఆధ్యాత్మిక విశేషాలను చెప్తూ ఆమె కూడా ఆనందిస్తుంది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా అమ్మ అమెరికాలో పర్యటిస్తున్నారు. జూన్ 2వ తేదీన ఫీనిక్స్ కు చేరుకున్నారు. రోజుకో నగరంలో పర్యటిస్తూ అక్కడి వారికి హిందూ ధర్మంలోని గొప్పతనం దాని చుట్టూ అల్లుకున్న విలువను బోధిస్తున్నారు.

    అమ్మ శ్రీ కరుణామయి మాతను అమెరికన్లతో పాటు అక్కడి ఇండియన్స్ ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆమె పట్ల భక్తిభావం చూపుతున్నారు. ఆమె ప్రవచనాలకు ఎక్కువ మొత్తంలో హాజరవుతున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటూ ఒకరిపై ఒకరికి ప్రేమ, కరుణ ఉండాలని చెప్తున్నారు. ఆధ్యాత్మికంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ అందుకు మనసును, శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలో వివరిస్తున్నారు. ప్రపంచలోనే అత్యంత గొప్ప గురువులకు జన్మిచ్చిన భారత్ గురించి కూడా ఆమె తన ప్రసంగంలో వివరిస్తున్నారు.

    అమెరికా పర్యటనలో ఉన్న ఒజాయ్ లో 13న అమ్మ శ్రీ కరుణామయి ప్రవచనాలు ఉన్నాయి. దీంతో ఆమె ఆ ప్రాతంలో జూన్ 12నే వచ్చారు. దీంతో అక్కడి అమెరికన్లు, ఎన్ఆర్ఐలు ఆమెను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. ఘన స్వాగతం పలికారు. అమ్మను కారు నుంచి సాదరంగా విడిది వరకు తీసుకువెళ్లారు. ఆమె నడిచే బాటలో పూలు చల్లారు. అమ్మను చూడడం తమ అదృష్టంగా భావిస్తున్నారు అక్కడి అమెరికన్లు. ఆమె ప్రసంగం అంటే ఆధ్యాత్మిక సంగమమే అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    అక్కడి ఇండియన్స్ కూడా ఆమెకు సాదర స్వాగతం పలికారు. వారిని అమ్మ ఆశీర్వదించారు. అమ్మ చూపే శాంతి బాట ఎన్నటికీ వీడమని చెప్పారు అమెరికన్లు. ఈ రోజు (జూన్ 13) అమ్మ శ్రీ కరుణామయి ఒజాయ్ లో తన ఆధ్యాత్మిక సందేశం వివరించనున్నారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ప్రవచనా ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి హిందూ ధర్మంలోని గొప్ప తనాన్ని వివరిస్తూనే వారికి కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. అమ్మకు అడుగడుగునా నీరాజనాలు అందుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    TFAS Ugadi Sambaraalu : న్యూజెర్సీలో కన్నుల పండువగా ఉగాది సంబరాలు.. అలరించిన మ్యూజికల్ నైట్

    TFAS Ugadi Sambaraalu : తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను తెలుగువారు...

    Ugadi Celebrations : NJTA ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు..

    Ugadi Celebrations : ఉత్తర అమెరికా మరియు భారతీయుల మధ్య వారధిగా...