Bhola shankar : స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కెరీర్ లో దూసుకు పోతున్న మెగాస్టార్ ఇటీవలే భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసారు.
అయితే భోళా శంకర్ తో చిరంజీవి మెగా ఫ్యాన్స్ ను నిరాశ పరిచాడు.. ఆగస్టు 11న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.. రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. కానీ కలెక్షన్స్ లో ఏ మాత్రం మెగా మానియా చూపించడం లేదు.. మూడు రోజుల భోళా వసూళ్లు సైతం దారుణంగా ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
అయితే ఈ సినిమాలో మెగాస్టా కాకుండా మరో మెగా హీరో కనిపించాడని సీరియస్ చర్చ జరుగుతుంది.. ఆ మెగా హీరో ఎవరు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. భోళా శంకర్ సినిమాలో కనిపించిన మెగా హీరో ఎవరా అని ఆలోచిస్తున్నారా.. అతడు ఎవరో కాదు కొణిదెల పవన్ తేజ్.. ఈయన కూడా మెగా హీరోనే..
మెగాస్టార్ బ్రదర్స్ కు కొడుకు వరస అయ్యే ఈయన తెలుగులో కల్పితం అనే సినిమాను కూడా చేసాడు. ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు.. హీరోగా ఇతడు ఫెయిల్ కావడంతో పెద్దగా అవకాశాలు లేవు.. దీంతో మెగాస్టార్ చేస్తున్న సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాడు.. ఆచార్య, గాడ్ ఫాదర్ తో పాటు ఇప్పుడు భోళా కూడా నటించాడు..
ఈయన ఎంట్రీ వల్లే చిరుకు ప్లాప్స్ వస్తున్నాయంటూ చర్చ జరుగుతుంది.. ఈయన అతిథి పాత్రలు చేసిన మూడు ఫెయిల్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. కానీ సినిమాలో మ్యాటర్ లేనిది ఈ హీరో మాత్రం ఏం చేస్తాడు అని మరికొంత మంది అంటున్నారు..