31.4 C
India
Sunday, April 28, 2024
More

    America : మరో ఉపద్రవం.. చిగురుటాకులా వణుకుతున్న అమెరికా

    Date:

    America
    America

    America : అమెరికాను హరికేన్లు భయపెట్టిస్తున్నాయి. తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. హిల్లరీ తుఫాను ప్రభావంతో ఆదివారం నైరుతి కాలిఫోర్నియాలో వర్షపాతం రికార్డుస్థాయిలో నమోదైంది. డౌన్ టౌన్ లాస్ ఏంజిల్స్ లో రోజువారీ రికార్డు స్థాయిలో 1.53 అంగుళాల వర్షపాతం నమోదైంది. ఇది 1906 నాటి పాత రికార్డు అయిన 0.03 అంగుళాలను బద్దలు కొట్టింది.  2002లో పడిన భారీ వర్షాల రికార్డును తిరిగిరాసింది.  అమెరికాలో ఇలాంటి హరికేన్లు సర్వసాధారణమే అయినా ఈ సారి మాత్రం మరింత వణికిస్తున్నాయి. ఏదేమైనా అమెరికాను వరుస ఉపద్రవాలు చుట్టుముట్టేస్తున్నాయి.

    ఇక లాంకాస్టర్ లోకూడా 2.27 అంగుళాల వర్షాపాతం నమోదైంది. 1945 నుంచి ఈ స్థాయిలో వర్షం పడడం ఇదే మొదటిసారి. ఇక తుఫాను కారణంగా నెవెడాలో గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  ఇప్పటికే సహాయక బృందాలను రంగంలోకి దించారు. అమెరికా వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతున్నది.

    ఇటు దక్షిణ కాలిఫోర్నియాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం వేసవి తుఫానుకు దారితీసిన సమయంలో ఇలా భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్రర భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనలు నెలకొన్నాయి.  అయితే ఎంత నష్టం జరిగిందనేది ఇంకా తేలలేదు. అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. విద్యుత్ లైన్లు, పలు కాలనీల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ భూకంప తీవ్రత మరికొన్ని ప్రాంతాల్లోనూ కనిపించింది. వాల్సెనియాలో దాదాపు 50 మైళ్ల దూరంలో భూకంపం దాదాపు 20 సెకన్ల పాటు ప్రభావం కనిపించింది. అయితే భూకంప నిపుణుడు డాక్టర్లూసీ జోన్స్ మాట్లాడుతూ శనివారం ఉదయమే ఈ చిన్న చిన్న ప్రకంపనలు మొదలైనట్లు తెలిపారు. ఫోర్ షాక్ సీక్వెన్స్ దీనికి ముందు జరిగినట్లు కనిపిస్తోందన్నారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Retirement : విరమణ తర్వాత ఆనందంగా గడిపేందుకు ఎంత అవసరం?

    Retirement : చాలా మంది ఉద్యోగులు సౌకర్యవంతమైన జీవనం కొనసాగించాలంటే గణనీయమైన...

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...

    Weather Updates : మండే వేసవిలో కూల్ న్యూస్.. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువేనట..

    Weather Updates : ఈ సారి (2024) ఎండ వేడిమి విపరీతంగా...