33.7 C
India
Sunday, May 5, 2024
More

    APCM YS Jagan Mohan Reddy : జగన్ పై యుద్ధానికి బీజేపీ రెడీనా.. టీడీపీతో దోస్తీ ఖాయమా..?

    Date:

    YSRCP VS BJP
    YSRCP VS BJP

    APCM YS Jagan Mohan Reddy : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య ఎన్నికల యుద్ధం మొదలైంది. ఇక ప్రజా క్షేత్రంలో అమీతుమి తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే రోడ్లపైకి ఎక్కారు. యాత్రలు, బహిరంగ సభలు, రోడ్ షోలు  అంటూ హడావుడి చేస్తున్నారు. ఈసారి చావోరేవో తేల్చుకునేందుకు టీడీపీ, రెండోసారి  గెలిచి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. ఈ దశలో ఎవరి వ్యూహాలు వారివి. ఎవరి ఎత్తుల వారివి.  ఇప్పటికే అస్ర్తశస్ర్తాలు సిద్ధమయ్యాయి. ప్రజల మనసులను గెలుచుకొని ఓట్లు కొల్లగొట్టాలని టీడీపీ ఇప్పటికే మినీ మ్యానిఫెస్టో పేరిట ప్రజల్లోకి వెళ్తున్నది. చంద్రబాబు, యువనేత లోకేశ్ జనంలోనే తిరుగుతున్నారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

    అయితే ఇక్కడే వైసీపీ అధినేత, సీఎం జగన్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. ఇప్పటికే టీడీపీ, జనసేన తనపై తీవ్రస్థాయిలో కత్తులు దూస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ మాత్రం తనకు అండగా ఉంటుందని భావిస్తూ వచ్చారు. కానీ ఇటీవల జరిగిన బీజేపీ బహిరంగ సభల్లో పాల్గొన్న అగ్రనేతలు జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. అవినీతి పరుడు జగన్ అంటూ ఏకంగా కేంద్రం హోం మంత్రి ప్రకటించారు. ఇక బీజేపీ కూడా టీడీపీ చెంతకు చేరడం ఖాయమని జగన్ ఢిఫెన్స్ లో పడిపోయినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆయన బీజేపీ అండ లేకపోయినా గెలుస్తా అని ఒక ప్రకటనకు పరిమితమయ్యారు. కానీ కేంద్ర పెద్దలపై మాత్రం ఒక్క మాట మాట్లాడలేకపోయారు.

    మరోవైపు బీజేపీ నిధులు ఇస్తున్నది తామేనని ప్రతిసారి అంటున్నది. కానీ దీనిపై బీజేపీ ఇచ్చిన నిధులపై ప్రధాన తెలుగు దినపత్రికల్లో ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే తమనే నమ్ముకొని ఉన్న రాష్ర్టంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలకు ఊహించని దెబ్బ తగులుతుందని భావించే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఎదగడం అటు టీడీపీకి, ఇటు వైసీపీ  కి ఇష్టం లేదు.అయితే జగన్ను తిట్టారనే వార్త మినహా బీజేపీ ఇచ్చిన నిధులపై ఆయన ప్రసంగించినా మీడియాలో ఎక్కడా చోటు లభించలేదు.

    అయితే బీజేపీ మాత్రం వైసీపీని ఢీకొట్టేందుకే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. ఒక్క మోదీ మినహా జగన్ పై బీజేపీ అగ్రనేతలు దాదాపు గుర్రుగా నే ఉన్నట్లు కనిపిస్తున్నది. మరోవైపు టీడీపీ చంద్రబాబుకు ఆర్ఎస్ఎస్ మద్దతునిస్తున్నట్లు టాక్ బయటకు వచ్చింది. జగన్పై కేసులు, ప్రత్యర్థుల పై ఆయన తీరు బీజేపీ అధిష్టానానికి నచ్చడం లేదని కూడా టాక్. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవల ఎన్ఎస్జీ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏకంగా కేంద్ర హోంమంత్రే చంద్రబాబుకు సపోర్ట్ పై హామీ ఇచ్చారని టాక్ కూడా వస్తున్నది. ఇక ఏపీలో జగన్ ఒంటరి పోరుకు సిద్ధం కావాల్సిందే. అయితే సింహం ఒంటరిగానే వస్తుందని వైసీపీ శ్రేణులు అంటుండగా, రావణుడి అంతటి వాడిని ఎదుర్కొనేందుకే రాముడు ఎంతో మందిని సమీకరించాడని. ఇది కూడా అంతేనని టీడీపీ శ్రేణులు దీటుగా సమాధానమిస్తున్నాయి. మరి రానున్న కాలంలో ఇక జగన్ కు ఇబ్బందులు తప్పేలా లేవు. కేవలం సంక్షేమ పథకాలు, పోలీసులను నమ్ముకున్నంత మాత్రాన ప్రజల మనసులు గెల్చుకుంటామంటే అదే తప్పే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Jagan : జగన్ పర్యటనలో తప్పిన ప్రమాదం.. విచారణకు కు అదేశం..

    CM Jagan : ఈనెల 14న జగన్ అనంతపురం జిల్లా పర్యటన...

    CM Jagan Bus Yatra : 25 నుంచి సీఎం బస్సు యాత్ర.. డిసెంబర్ 31 వరకు ఏఏ ప్రాంతాల్లో అంటే..

    CM Jagan bus Yatra : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి...

    Satires on Jagan & KCR : ‘తమ్ముడు నువ్ త్యాగ జీవిరా‘.. జగన్, కేసీఆర్ దోస్తీపై సెటైర్లు

    Satires on Jagan & KCR : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన...

    CM YS Jagan : అమిత్ షాతో నేడు జగన్ కీలక భేటీ.. చంద్రబాబు అంశంపైనా చర్చ

    CM YS Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ఉన్నారు....