37.7 C
India
Saturday, April 27, 2024
More

    Ayyappa Swamy : అభిషేకాలు, హోమాలు.. మూడో రోజు ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు..

    Date:

    Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 3rd Day
    Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 3rd Day

    Ayyappa Swamy : అమెరికాలోని న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొనసాగుుతన్న ‘ప్రాణ ప్రతిష్ట’ వేడుకలు కన్నుల జరుగుతున్నాయి. ఆలయంతో పాటు ఎడిసన్ మొత్తం ఆధ్యాత్మికత వాతావరణం సంతరించుకుంది. ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తుండడంతో పాటు విగ్రహ ఏర్పాట్లు కూడా చేపడుతున్నారు.

    హరిహర సుతుడు అయ్యప్ప స్వామి సాయి దత్త పీఠంలోని శ్రీ శివ విష్ణు దేవాలయంలో కొలువు దీరబోతున్నారు. స్వామి వారితో పాటు శ్రీ ఆది శంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, కాల భైరవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈ వేడుకల కోసం ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. మార్చి 17 (ఆదివారం) నుంచి మార్చి 20 (బుధవారం) వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

    మార్చి 18 (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు గణపతి పూజ, పుణ్యహవచనం, వాస్తు శాంతి, మృత సంగ్రహనం, అంకురార్పణం, యజమాన ఆచార్య రక్షాబంధనం, నూతన విగ్రహ జనాధివాసం, కుంభాలంకారం, కాళహస్త పఠనం, అగ్ని ప్రతిష్ట, ఫస్ట్ కాలయాగ పూజ, పూర్ణాహుతి, హారతి, తీర్థ ప్రసాద వితరణం నిర్వహించారు.

    మార్చి 19 (మంగళవారం) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విశేష శాంతి, గణపతి పూజ, పుణ్యహవచనం, యాగశాల పూజ, వేదికార్చన, కాలయాగ పూజ, వేద పఠనం, విశేష కాల భైరవ, అయ్యప్ప, ఆది శంకరాచార్య రామానుజ ఆచార్య మూల మంత్ర ద్రవ్యతృతి, దాస దర్శనం (పాలు, వెన్నె, నెయ్యి, బంగారం, వెండి, కన్య, సువాసిని, యజమానన్, దంపతి, ఆచార్యన్), పూర్ణాహుతి, తీర్థ ప్రసాద వితరనం నిర్వహించారు.

    ఇక సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విశేష సంధి, గణపతి పూజ, పుణ్యహవచనం, నూతన విగ్రహ నయనాదివాసం, నూతన విగ్రహ శయనాదివాసం, మూడో కాల యాగశాల పూజ, వైదికార్చన, విశేష మంత్ర పూజా, హోమం, వేద పఠనం, హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు.

    శాస్త్రోక్తంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు, ఈ ఆధ్యాత్మిక వేడుకల కోసం భారత్ నుంచి ప్రముఖులు హాజరైనట్లు కమిటీ తెలిపింది. ప్రాణ ప్రతిష్ట రోజు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, భక్తుల అంచనాలను బట్టి మరింత పెంచుతామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.

    All Images Courtesy : Dr. Shiva Kumar Anand (Jaiswaraajya Tv & JSW Tv Global Director)

    More Images : Ayyappa Swamy Vigraha Pratishtapana Mahotsavam 3rd Day Photos

    Share post:

    More like this
    Related

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayyappa Swamy : రెండో రోజు దత్త పీఠంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు..

    Ayyappa Swamy : అమెరికాలోని న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం...

    అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

    శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం వైభవంగా జరిగింది. పెద్ద...