
Bus seat fight : బస్సులో సీటు కోసం ఇద్దరు గొడవకు దిగగా అది బంద్ వరకు వెళ్లింది.. ఇదేదో అచ్చం ‘ఒకే ఒక్కడు’ సినిమాలోని విషయం లాగే ఉంది అనుకుంటున్నారా అవునండి ఇది అదే. ఇందులో కూడా రాజకీయం జొప్పించి ఒక జిల్లా బంద్ కు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిలో కొందరు సదరు పార్టీని విమర్శిస్తుంటే.. మరి కొందరు సమర్ధిస్తున్నారు. ఏది ఏమైనా గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకువచ్చారిన సర్వత్రా చర్చ నడుస్తోంది.
కరీంనగర్-జగిత్యాల బస్సు కరీంనగర్ నుంచి బయల్దేరింది. అందులో ఉన్న ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవకు దిగారు. అయితే ఇందులో ఒకరి భర్త ఎస్ఐ. అయితే ఆపోజిట్ లో ఆమెతో గొడవకు దిగింది ముస్లిం యువతి. అయితే తను గొడవపై తన భర్తకు చెప్పింది సదరు మహిళ. ఆయన ఎస్ఐ అంటూ ఈ గొడవలో తలదూర్చాడు. ఇంకేముంది ఆయన ఎస్ఐగా సస్పెండ్ అయ్యాడు, పైగా ఆయన భార్యపై కూడా కేసు నమోదైంది. తనపై ఎస్ఐ దాడి చేశాడని, జుట్టు పట్టుకొని బస్సులో కిందికి లాగి పడేశాడని, సదరు ఎస్ఐ భార్య కూడా తనపై దాడి చేసిందని ఆ ముస్లిం యువతి ఆరోపణలు చేసింది. దీంతో ఎస్ఐని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన భార్యపై కేసు నమోదైంది. ఇక్కడ ఎస్ఐ భార్య సంధ్య మరోలా చెప్తున్నారు. సదరు ముస్లిం యువతే తనను ధూషించడంతో పాటు దాడి కూడా చేసిందని వాపోయింది. తన భర్త ఆమెను కనీసం ముట్టుకోలేదని చెప్తుంది.
ఇదంతా అటుంచితే ఈ గొడవను నెత్తినెత్తుకుంది బీజేపీ. ఇద్దరు మహిళల మధ్య వివాదం తలెత్తితే ఎలాంటి విచరణ చేపట్టకుండా ఎస్ఐ సస్పెండ్ చేయడం ఏంటని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ జేబులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కేవలం ఫోన్ లో ఆదేశాలిస్తేనే ఎస్ఐని సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. దీనిని నిరసిస్తూ బీజేపీ శనివారం (మే 13) బంద్ కు పిలుపునిచ్చింది. ఇక్కడ ఎస్ఐ మాత్రం తన సస్పెన్స్ వ్యవహారం పూర్తిగా డిపార్ట్ మెంట్ అంశమని ఇందులో ఎలాంటి రాజకీయాలు చేయద్దని చెప్తున్నారు.