37.8 C
India
Monday, April 29, 2024
More

    BJP Prove : బలం నిరూపించుకోవాలని కాషాయదళం ఆరాటం..!

    Date:

    BJP prove
    BJP prove
    BJP prove : ఖమ్మం రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ఇప్పటికే ఖమ్మంలో పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నది. పొంగులేటి బీజేపీలో చేరకపోవడం వెనుక స్థానిక ప్రాంతంలో బీజేపీకి బలం లేదనే వాదన కూడా వినిపిస్తున్నది. ఇదే సమయంలో ఖమ్మంలో సత్తా చాటేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది.
    ఖమ్మం వేదికగా బీజేపీ అధినేత అమిత్ షాతో బహిరంగ సభ నిర్వహించి ఖమ్మంలో అక్క తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు, తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తుంది. బీజేపీ అగ్రనేతలు రాష్ర్టంలో పర్యటించనున్నారు.
    ఈ క్రమంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 15న ఖమ్మంలో  నిర్వహించనున్న బహింగ సభకు హాజరు కానున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట, మహబూబాద్ జిల్లాల నుంచి లక్షలాది మందిని తరలించి తమ సత్తా చాటేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. సభను విజయవంతం చేసి ఈ సమావేశం ద్వారా తమ సత్తా ఏంటో చూపించేందుకు సీనియర్ నేతలతో కమిటీ వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
    బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మంలో ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో ఖమ్మంపై గట్టి ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచింది. రాష్ట్రం మొత్తం ఒక రకంగా తీర్పు ఇస్తే ఖమ్మం జిల్లా ఓటర్లు మాత్రం బీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు ఆ స్థానాన్ని తాము భర్తీ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ సభ తర్వాత గాలి ఎటువైపు మళ్లుతుందో వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    Power Cut : అరగంట విద్యుత్ కట్.. డీఈ సస్పెన్షన్

    Power Cut : అరగంట విద్యుత్ నిలిచిపోయిన నేపథ్యంలో ఓ డీఈని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Government Jobs : అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

    Government Jobs : ఎవరికైనా లక్ కలిసొస్తే వారి ఇళ్లు నందనవనంగా...

    Congress Tickets : ఖమ్మం నుంచి తుమ్మల.. పాలేరుకు పొంగులేటి.. కాంగ్రెస్ సీట్లు కన్ఫమ్.. షర్మిలకు దారేది?

    Congress Tickets : తెలంగాణ కాంగ్రెస్ ఈసారి గెలుపునే ధ్యేయంగా ముందుకెళుతోంది. బీఆర్ఎస్...

    Groom Stuck In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వరుడు.. క్లియర్ చేసిన పోలీసులు

    Groom Stuck In Traffic : పెళ్లంటే నూరేళ్ల పంట.. పండితులు పెట్టిన...

    AP : ఆ కంపెనీల ద్వారా కాంగ్రెస్ కు జగన్ ఫండింగ్.. అవేంటో తెలుసా?

    AP ఏపీలో ఏ కాంట్రాక్టు పొందాలన్నా అది రాఘవ కన్ స్ట్రక్షన్స్...