33.8 C
India
Sunday, May 5, 2024
More

    Groom Stuck In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వరుడు.. క్లియర్ చేసిన పోలీసులు

    Date:

    Groom Stuck In Traffic :

    పెళ్లంటే నూరేళ్ల పంట.. పండితులు పెట్టిన సుముహర్తానికి జిలుకర బెల్లం పెట్టించుకోవాలని అంతా అనుకుంటుంటారు. అందుకే అంతా పెళ్లి మండపానికో, పెండ్లింటికో సకాలంలో చేరుకుంటారు. ఇలాగే ఇక్కడ కూడా ఒక వరుడు పెండ్లి మండపానికి బయలుదేరాడు. ఇంకో 30 కిలో మీటర్లు వెళ్తే చాలు.. ఇంతలోనే వరుడు కి హైరానా పుట్టింది. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామైంది. అందులో చిక్కుకున్నాడు. సుముహూర్తానికి చేరుకుంటానో లేదో అంటూ టెన్షన్ మొదలైంది.

    వర్ధన్న పేట మండలం ఇల్లంద గ్రామ శివారులో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో బోల్తా కొట్టింది. దానిని తొలగించే సమయంలో పోలీసులు సుమారు రెండున్నర గంటల సేపు ఇరువైపులా వాహనాలను నిలిపేశారు. పెండ్లి చేసుకోవడానికి బయలు దేరిన ఓవరుడు ఇందులో చిక్కుకుపోయాడు. హనుమకొండ నుంచి తొర్రూరుకు ఆయన వెళ్తున్నాడు. ఇక ముహూర్త సమయం ముంచుకొస్తుండడంతో కొంత టెన్షన్ పడ్డాడు. తన పెండ్లి ముహూర్తం సమీపిస్తున్నదని, త్వరగా ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసులను కోరాడు. దీంతో వరుడి విన్నపాన్ని కాదనలేని పోలీసులు ట్రాఫిక్ క్లియర్ కు సహకరించారు. మొత్తానికి వరుడు తొర్రూరుకు చేరుకున్నాడు. వధువు మెడలో తాళి కట్టాడు. ట్రాఫిక్ లో చిక్కుకున్నాడని తెలిసి, పెండ్లి మండపం వద్ద వధువు కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కొంత టెన్షన్ కు లోనయ్యారు.

    అయితే జాతీయ రహదారిపై ఇదంతా ఫొటోలు, వీడియోలు తీసిన పలువురు సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై కామెంట్ల వర్షం కురుస్తున్నది. పెండ్లి మీద కొందరు వ్యంగ్యంగా కూడా స్పందించారు. ఏదేమైనా పెండ్లి సమయానికి జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ ను నిలిపిన పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు సహకరించి ట్రాఫిక్ క్లియర్ చేసిన సిబ్బంది కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Telangana : తెలంగాణలో వడదెబ్బతో 19 మంది మృతి

    Telangana : తెలంగాణలో ఎండలకు తాళలేక వృద్ధులు, దినసరి కూలీలు మరణిస్తున్నారు....

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Wedding : సినిమా స్టైల్లో పెళ్లిపీటలమీద ఆగిన పెళ్లి.. షాక్ అయిన పెళ్లికూతురు 

      Wedding : కర్నూలు జిల్లా ఓ చీటర్ మోసం పెళ్లిపీటలపై బట్టబయలైంది....

    Kakatiya Sculptures : కాకతీయ శిల్పాలకు ప్రాణం.. నేడు ప్రారంభం

    Kakatiya Sculptures : వరంగల్ వేయిస్తంభాల గుడిలో నీ కళ్యాణ మండపం...

    Viral Video : కోపంతో పెళ్లి కూతురును తోసేసిన వరుడు వీడియో వైరల్..

    Viral Video : వివాహాది క్రతువులో వధూవరులు, బంధువులు సరదాగా ఆటపట్టించుకోవడం...

    Government Jobs : అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు

    Government Jobs : ఎవరికైనా లక్ కలిసొస్తే వారి ఇళ్లు నందనవనంగా...