BJP : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి విరాళాల వరద పారుతోంది. 2022-23 సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి రూ. 1300 కోట్ల నిధి రాబట్టుకుంది. కాంగ్రెస్ కు కూడా విరాళాలు వచ్చినా తక్కువగానే ఉన్నాయి. బీజేపీకి వచ్చిన విరాళాలు రూ.2120 కోట్లు రావడంతో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే వచ్చాయని ఎన్నికల సంానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
బీజేపీ, కాంగ్రెస్ జాతీయ పార్టీలుగా ఉండటంతో విరాళాల వెల్లువ కొనసాగుతోంది. 2021-22 సంవత్సరంలో రూ.236 కోట్లు రాబట్టుకుంది. 2022-23 సంవత్సరంలో 171 కోట్లు సాధించుకుంది. 2021-22 సంవత్సరంలో బీజేపీకి వచ్చిన విరాళాలు రూ.1775 కోట్లు, 2021-22 లో 1917 కోట్ల కన్నా 2022-23లో రూ.2366 కోట్లు తెచ్చుకుంది.
టీడీపీకి 2022-23లో రూ. 34 కోట్లు వచ్చాయి. వడ్డీల రూపంలో 2021-22లో రూ. 135 కోట్లు పొందింది. 2022-23లో రూ. 237 కోట్లు వరకు సాధించింది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి విమానాలు, ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ ల కోసం 2021-22లో 117 కోట్లు చెల్లించింది. 2022-23 నాటికి రూ. 78 కోట్లు చెల్లించింది. ఇలా పార్టీ తన ఖర్చులు చెల్లించుకుంది.
దేశంలోని పార్టీలకు ప్రతి ఏడాది విరాళాలు రావడం ఖాయం. దీంతో వాటి మనుగడ కోసం వాటిని ఖర్చు చేస్తుంటాయి. పార్టీ ఖర్చుల కోసం విరాళాలు ఖర్చు పెడుతుంటాయి. జాతీయ పార్టీలకు ఈ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు తక్కువగా ఉంటాయి. దీంతో పార్టీల విరాళాల గురించి ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంటాయి.