వినూత్న కార్యక్రమాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న JSW & Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ శరవేగంగా దూసుకుపోతోంది. JSW tv లక్ష సబ్ స్క్రైబర్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడంతో సంస్థ కార్యాలయంలో కేక్ కేట్ చేశారు JSW & Jaiswaraajya.tv సంస్థల గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్.
తక్కువ సమయంలోనే లక్ష మార్క్ ను అందుకున్న సందర్భంగా యూట్యూబ్ సిబ్బందిని అభినందించారు. ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పని చేసినందువల్లే ఈ విజయం సాధించామని, మునుముందు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చారు.
U blood ఫౌండర్ , JSW & Jaiswaraajya సంస్థల అడ్వైజర్ డాక్టర్ జై యలమంచిలి నిర్దేశకత్వంలో ఈ విజయాలు సాధించమని , అందుకు డాక్టర్ జై యలమంచిలికి కృతజ్ఞతలు అంటూ సిబ్బందిని అభినందించారు డాక్టర్ శివకుమార్ ఆనంద్. ఈ కార్యక్రమంలో JSW & Jaiswaraajya.tv సిబ్బంది పాల్గొన్నారు.