Congress leader Dance : ఓ జడ్పీటీసీ భర్త హల్ చల్ చేశాడు. అది పోలీసులు విధించిన శిక్షనా లేక ఎక్స్ ట్రానా? అని నెటిజన్లు మండి పడుతున్నారు. ఎక్కడో డాన్స్ చేస్తే పట్టించుకోమని, మరీ పోలీస్ స్టేషన్ లో అంటే అనుమానాలు కలుగుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ జడ్పీటీసీ గుడాల అరుణ భర్త శ్రీనివాస్ సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో స్టెప్పుడు వేసిన వీడియో వైరల్‌గా మారింది. హీరో నాగార్జున నటించిన ‘నేనున్నాను’ సినిమాలోని ‘నీ కోసం నీ కోసం.. నీ కోసం….’ పాటకు పోలీస్ స్టేషన్ లో డాన్స్ చేస్తుండగా, స్టేషన్ కానిస్టేబుళ్లు సైతం ఎంకరేజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పోలీస్ స్టేషనా డాన్స్ క్లబ్ నా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై పోలీస్ శాఖ కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ ఉన్న కానిస్టేబుళ్లను పలకరించాడట. ఇటీవల శ్రీనివాస్ ఒక చోట డాన్స్ చేసింది చూసిన పోలీసులు మీరు బాగా డాన్స్ చేస్తారంటూ ఎంకరేజ్ చేస్తూ మొబైల్ లో ఓ పాటను ప్లే చేశారట. ఇంకేముంది శ్రీనివాస్ డాన్స్ షురూ చేసిండు.
శ్రీనివాస్ డాన్స్ చేస్తుండగా పోలీసులు సైతం మస్త్ ఉందంటూ ఎంకరేజ్ చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో జడ్పీటీసీ భర్త తీరు ఎలా ఉన్నా.. పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే శ్రీనివాస్ మాత్రం డాన్స్ ఒక ఎక్సర్ సైజ్ లాంటిదని తనతో చనువుగా ఉండే ఒక కానిస్టేబుల్ కు చూపిస్తున్నానని, ఇందులో మరో ఉద్దేశం లేదని చెప్పాడు. దీనిని ఒక గ్రూపులో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలోకి చేరి వైరల్ అయ్యిందని చెప్పారు.
మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ జెడ్పిటీసి భర్త “మన్మధుడా” అంటూ చిందులు
పాటలు పెట్టి మరీ వీడియో తీసిన పోలీసులు.
మంథనిలో మంటగలుస్తున్న పోలీస్ ప్రతిష్ట.
మంథనిలో కాంగ్రెస్ నాయకులు ఏది చెబితే అదే అంటున్న పోలీసులు.
పోలీస్ స్టేషనా లేక డ్యాన్స్ ఇన్స్టిట్యూటా అని ముక్కున… pic.twitter.com/6dX9Zu4Lss
— Telugu Scribe (@TeluguScribe) April 15, 2024