
Credit Card Payments : క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో ఘననీయంగా పెరిగింది. అవసరానికి కార్డులో డబ్బులు యూజ్ చేసుకొని తిరిగి డ్యూ డేట్ లోగా కట్టి కాలం వెళ్లదీస్తున్నారు మధ్య తరగతి వినియోగదారులు. కొందరు మినిమమ్ బిల్లు మాత్రమే కడుతుంటారు. ఇందులో ఇంకొందరు వినియోగదారులు తమకు జనరేట్ అయిన బిల్లు కంటే ఎక్కువ కడుతున్నారు.
ఇక ఎక్కువ కట్టిన డబ్బులను తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా వాడుకుంటున్నారు. ఇంకా మిగిలితే వచ్చే నెలలో బిల్లులో కట్ అవుతున్నాయి. మరి కొంత మంది వినియోగదారులు స్టాండింగ్ అమౌంట్ కంటే ఎక్కువ చెల్లించి తర్వాత వాడుకుంటున్నారు. ఇన్నాళ్లు ఇది కొనసాగినా ఇప్పుడు బ్యాంకులు ఈ పద్ధతిని ఎత్తేయాలని అనుకుంటున్నాయి. ఔట్ స్టాండింగ్ అమౌంట్ కంటే ఎక్కువ కట్టేందుకు నిరాకరిస్తున్నాయి. అయితే, అందుకు కారణం కూడా ఉందని బ్యాంకులు అంటున్నాయి.
ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఓవర్ పే (ఔట్ స్టాండింగ్ అమౌంట్ కన్నా ఎక్కువ) చేయనివ్వడం లేదు. ఎస్బీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు ఓవర్ పే చేయకుండా కష్టమర్లను నిలవరిస్తున్నాయి. ఒక వేళ ఎక్కువ చెల్లిస్తే డ్యూ డేట్ ముగిసిన తర్వాత కస్టమర్ల బ్యాంకు ఖాతాకు రీఫండ్ చేస్తున్నాయి.
ఇప్పటికే చాలా బ్యాంకులు ఓవర్ పే చేయకుండా నిలువరించేందుకు ఇంటర్నల్ గార్డ్స్ ఏర్పాటు చేసుకున్నట్లు బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. అయినా థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా కస్టమర్లు ఓవర్ పే చేస్తున్నారని చెప్తున్నారు. ఒక వేళ ఇలా చేస్తే సదరు బ్యాంకులు ఆ ఓవర్ పే అమౌంట్ ను వారంలోగా కస్టమర్ల ఖాతాల్లోకి రిఫండ్ చేస్తున్నారు.