
Matisha Pathirana : భారత జట్టు మాజీ సారధి మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో విజయాల జోరు కొనసాగిస్తున్నాడు. తనదైన ఆటతో ఇప్పటికే ఆరుసార్లు ఐపీఎల్ కప్ గెలుచుకున్న సీఎస్ కే ప్రస్తుతం కూడా ఫైనల్ కు చేరింది. జట్టులో శ్రీలంక బౌలర్ మతీషా పతిరానా మంచి స్థాయిలో బౌలింగ్ చేస్తున్నాడు. ఈ కుర్రాడు అద్భుతాలు చేస్తున్నాడు.
పతిరానాను ధోని పతిరానాను దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాడు. దీంతో టీంలో పతిరానా ప్రతిభ చూపిస్తున్నాడు. సీనియర్ బౌలర్ కు తీసిపోని విధంగా బౌలింగ్ చేస్తున్నాడు. మలింగ స్టైల్ యాక్షన్ తో బౌలింగ్ చేస్తున్న ఇతడు టెస్టులు ఆడొద్దని వన్డే, టీ20ల మీద ఫోకస్ పెట్టాలని ధోనీయే స్వయంగా చెప్పడంతో అతడి మీద ధోనీ ఎంత నమ్మకం పెట్టుకున్నాడో తెలుస్తోంది.
ధోనీ ఎవరినైనా ప్రోత్సహిస్తే అంతే సంగతి. అతడి జాతకమే మారుతుంది. ఇప్పడు పతిరానా ప్రతిభ బయటకు రావడంతో అందరు ప్రశంసిస్తున్నారు. పతిరానా కుటుంబ సభ్యులు శ్రీలంక నుంచి ఇండియా వచ్చి ధోనీని కలిశారు. ఫొటోలు తీసుకున్నారు. వీళ్లకు దోనీ మాటిచ్చాడు. పతిరానా ప్రతిభ బాగుంది. అతడి భవిష్యత్ బాగుంటుందని భరోసా ఇచ్చాడు.
ధోని మాటిచ్చాడంటే అతడి భవిష్యత్ గాడిలో పడటం ఖాయం. అందుకే పతిరానాకు ధోని ప్రశంసల జల్లు కురిపిస్తున్నాడు. సీనియర్ బౌలర్లకు ఏ మాత్రం తీసిపోకుండా బౌలింగ్ చేయడంపై సీఎస్ కే టీం పతిరానా కావాలని పట్టుబడుతున్నారు. ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేస్తుండటంతో అతడి కెరీర్ గాడిలో పడినట్లే అని చెబుతున్నారు.