
Divorce rate : పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని నానుడి ఉంది. విడాకులు అనే మాట మన ఇండియాలో వినిపించడం చాలా అరుదనే చెప్పాలి. గ్లోబలైజేషన్ పెరుగుతున్న సమయంలో విడాకుల మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఇందులో పేద వారి కంటే ధనికులే ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. అది కూడా చాలా వేగంగా విడిపోతున్నారట. ఇదంతా ప్రాశ్చాత్య కల్చర్ అంటూ కొందరు వాదిస్తున్నా.. సోషల్ మీడియా ప్రభావం కూడా విపరీతంగా ఉందని మరికొందరు కౌటర్ ఇస్తున్నారు.
ఇటీవల నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పేదవారిలో కంటే ధనికుల్లోనే విడాకుల శాతం ఎక్కువని తేలింది. కోట్లాది రూపాయలు గుమ్మరిస్తూ భారీ సెట్టింగులు, భారీ ప్రముఖుల మధ్య వివాహం చేసుకుంటున్న జంట కొన్ని రోజులు కూడా కలిసి జీవించడం లేదు. పెళ్లి జరిగిన నాటి నుంచి ఫ్యామిలీతో విడిగా ఉండే జంట చిన్నపాటి గొడవకే విడాకుల వరకూ తీసుకెళ్తున్నారు. అయితే ఇది ఇండియాలో చాలా తక్కువగా ఉండేది. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా కలిసి జీవిస్తున్నారు. ఒకరికి ఒకరు అంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ ధనికులు మాత్రం ఎందుకు అంత తొందరపడుతున్నారు అంటూ చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి.
ధనికుల్లో దాదాపుగా ఇరువైపుల వారు బాగా చదువుకున్న వారే అయి ఉంటారు. లేదా మంచి మంచి ఫ్రొఫెషన్ నుంచి వచ్చిన వారు ఉంటారు. ఒకరి అవసరాల కోసం మరొకరు వివాహం చేసుకున్నారు అనిపిస్తుంది. ఇందులో విడాకులు తీసుకున్న వారు దాదాపుగా ఏదో ఒకవిధంగా వెల్ సెటిల్డ్ అయి ఉంటారు. దీంతో ఇద్దరి మధ్యా వివాదం తలెత్తితే ఎవరూ తగ్గకుండా విడాకుల వరకూ తీసుకెళ్తున్నారు. విడాకులు కూడా వీరికి వేగంగా వస్తుంటాయి.
ఇక పేద వారి గురించి పరిశీలిస్తే వారు మధ్య, సాధారణ దిగువ కుటుంబానికి చెదిన వారు ఉంటారు. అందులో భార్య, భర్తలు చాలీ చాలనీ సౌకర్యాలతో కాలం వెల్లదీస్తారు. తను భర్త నుంచి, లేదా భార్య నుంచి విడిపోతే మరొకరిపై భారం పడుతుందని భావిస్తారు. అరకొర వసతుల మధ్య కాంప్రమైజ్ అవుతూ జీవితాన్ని చివరి వరకూ కొనసాగిస్తారు. ఒక వేళ విడాకుల కోసం కోర్టుకు వెళ్లాలనుకున్నా అక్కడి ఖర్చులు కూడా వారు భరించలేరు. అందుకే వారిలో విడాకులు రేటు తక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా విడాకులు అనేది మాత్రం ఇండియా కల్చర్ కాకున్నా ఇక్కడ కూడా విడాకుల రేటు రాను రాను పెరుగుతూ వస్తోంది.