
Weddings From November : దేశంలో మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది. మంచి రోజులు రావడంతో పెళ్లి సందళ్లు షురూ కానున్నాయి. నవంబర్ 23 నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలు కానుంది. ఈ సీజన్ లో దేశవ్యాప్తంగా 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. దీంతో వ్యాపారాలు ముమ్మరంగా ముందుకు వెళ్లనున్నాయి. ఫంక్షన్ హాల్స్, బంగారం, ఇతర వస్తువుల దుకాణాలు సందడి చేయనున్నాయి. వ్యాపారం మూడు పువ్లులు ఆరు కాయలుగా మారనున్నాయి.
వ్యాపార రంగంలో రూ. 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగే సూచనలున్నాయి. గత ఏడాది దాదాపు 32 లక్షల పె ళ్లిళ్లు జరగ్గా రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు చెబుతున్నారు. కార్తీక మాసంలో వచ్చే పెళ్లిళ్లు నవంబర్ 23 నుంచి మొదలవనున్నాయి. తిథి, నక్షత్రాల ప్రకారం నవంబర్ 23,24,27,28,29 తేదీల్లో ముహూర్తాలు బాగున్నాయి. ఇంకా డిసెంబర్ నెలలో 3,4,7,8,9 తోపాటు 15వ తేదీ కూడా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయి.
వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో ప్రముఖ వ్యాపార సంస్థలు, వస్తువులు అందించే దుకాణాలు పెళ్లిళ్ల సందడితో వ్యాపారాలు ముమ్మరం చేయనున్నాయి. 38 లక్షల వివాహాలు ఉండటంతో మంచి వ్యాపారాలు కొనసాగేలా ఉన్నాయని చెబుతున్నారు. శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లి సందళ్లు కనువిందు చేయనున్నాయి. కల్యాణ మండపాలు కళకళలాడనున్నాయి.
పురోహితులు, క్యాటరింగ్ చేసే వారికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో పెళ్లిళ్లు ఉండటంతో అందరిలో ఉత్సాహం నెలకొనడం ఖాయం. ఈనేపథ్యంలో పెళ్లి ముహూర్తాలు అందరికి పండగ వాతావరణం కల్పించనున్నాయి. ఇన్నాళ్లు పని లేని వారికి కూడా పని దొరకనుంది. బంగారం వ్యాపారులు కూడా మంచి గిరాకీ రానుంది.