
Chiranjeevi : తెలుగు సినిమాలో చిరంజీవికి ఉన్న పేరు ఎలాంటిదో తెలిసిందే. మెగాస్టార్ గా దశాబ్దాల పాటు తన సత్తా చాటుతున్నాడు. ఆయన డ్యాన్స్, నటన, డైలాగులతో తనకెదురే లేదని నిరూపించుకున్నాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ముందుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి హీరో ఇప్పటికి కనిపించలేదు. చిరంజీవి ప్లేస్ ను భర్తీ చేసే హీరో ఇంతవరకు రాలేదు.
సినిమా పరిశ్రమలో కూడా చిరుకు అభిమానులున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సినిమాల్లోకి చాలా మంది వస్తున్నారు. ఎంతో మందికి ఆయన రోల్ మోడల్. అలాంటి హీరోతో ఏ చిన్న వేషమైనా దొరికితే చేయడానికి అందరు రెడీగా ఉంటారు. అలాంటి చిరుతో నటించడానికి చాలా మంది వేచి చూస్తున్నారు. చిరంజీవితో చిన్న పాత్ర చేసినా సరే జన్మ ధన్యమవుతుందని అనుకుంటారు.
అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ కూడా ఉన్నారు. చిరుతో కలిసి నటించాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ అవకాశమే రావడం లేదు. వస్తే చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధమే. కానీ నిర్మాతల నుంచి పిలుపు వస్తే కచ్చితంగా చేస్తానని చెబుతున్నాడు.
విక్రమ్ వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ముందుంటాడు. శంకర్ దర్శకత్వలో నటించిన అపరిచితుడు అతడి నటనకు అద్దం పట్టింది. విభిన్నమైన పాత్రలు చేయడంలో అందెవేసిన చేయి. అందుకే తన సినిమాలు బాక్సాఫీసు దగ్గర హిట్ గా నిలుస్తాయి. అలాంటి హీరో కూడా చిరంజీవితో నటించేందుకు ఉత్సుకత చూపిస్తున్నాడు. జీవితంలో ఒక్కసారైనా మెగాస్టార్ తో కలిసి నటించాలని ఉందని అంటున్నాడు.