32.2 C
India
Monday, April 29, 2024
More

    Fire Safety Window Ladder : మీ భవనానికి ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్ ఉందా?

    Date:

    Fire Safety Window
    Fire Safety Window Ladder

    Fire Safety Window Ladder : దేశంలో గృహ నిర్మాణం పుంజుకుంటున్నది. చిన్న పట్టణాల్లో సైతం ఐదారు అంతస్తుల బిల్డింగ్ లు వెలుస్తున్నాయి. ఇక హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఆకాశహర్మ్యాలు కామన్ గా కనిపిస్తూనే ఉంటాయి. పది అంతస్తుల నుంచి యాభై, అరువై అంతస్తుల వరకు ఉంటాయి. పెద్ద పెద్ద భవనాల్లో అగ్ని ప్రమాదాలు కానీ, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అందులో ఉండేవారిని భద్రంగా తీసుకొచ్చే చర్యలు తీసుకోవడం కష్టం. ఎలివేటర్లు, లిఫ్ట్, మెట్ల మార్గంలో వారిని కిందికు దించాలంటే ఎంతో ప్రయాసతో కూడుకున్న పని. భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు పొగ, మంటలు వేగంగా విస్తరిస్తూ ఉంటాయి. క్షణాలు, నిమిషాల్లోనే వారిని ఆదుకోవాల్సి ఉంటుంది.

    నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం ప్రతీ సంవత్సరం దేశంలో 25వేల మంది అగ్ని ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. మరణించినవారిలో ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధులే ఎక్కువగా ఉండడం బాధించే విషయమే. పెద్ద పెద్ద భవనాల నుంచి అగ్ని ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు కొత్త కొత్త విధానాలు, పరికరాలను తీసుకొస్తున్నారు. వీటిలో ఫైర్ స్ప్రింకర్లు, అగ్నిమాపక డిటెక్టర్లు లాంటివి ఉంటాయి. అయితే ఇవి చిన్న బిల్డింగ్ ల్లో మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. బహుళ అంతస్తుల బిల్డింగ్ ల్లో ఫైర్ ఎస్కేప్ కోసం ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్లు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయి.

    ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్లు ఆ భవనం యొక్క ప్రతీ అంతస్తులో ఒకటి, నిచ్చెనలు లేదా మెట్లకు కలిపి ఉంటాయి. ఇవి కిటికీలకు వెలుపల అమరుస్తారు. భవనం కింది నుంచి పై అంతస్తు వరకు ఒక నిచ్చెనలాగా ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీటి ద్వారా భద్రతా సిబ్బంది బాధితులను వేగంగా కిందికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన అంతస్తు నుంచి వెంటనే బాధితులను క్షేమంగా తప్పించవచ్చు. అలాగే పై అంతస్తు నుంచి ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్లు ద్వారా సురక్షితంగా కిందికి చేరుకోవచ్చు. అలాగే కింది నుంచి రక్షణ సిబ్బంది పై అంతస్తుకు చేరుకోవచ్చు. బహుళ అంతస్తుల భవనాల్లో ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్లను అమర్చుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే ఆస్తి, ప్రాణనష్టాలను భారీగా తగ్గించవచ్చు. విదేశాల్లో వీటిని బాగానే ఉపయోగిస్తున్నా..మన దేశంలో వీటి వాడకం తక్కువే. అందుకే ప్రభుత్వాలు ఫైర్ సేఫ్టీలో భాగంగా ఫైర్ సేఫ్టీ విండో ల్యాడర్లను వాడకాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరముంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Goods Train Odisha : ఒడిశాలో మరో రైలు ప్రమాదం

    Goods Train Odisha : ఒడిశాలో ఇటీవల వరుసగా రైలు ప్రమాదాలు...