![Double Smart](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/ram-puri-222-1615973237.jpg)
Double Smart Movie : పూరీ జగన్నాథ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ఇస్మార్ట్ శంకర్. దానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా విషయంలో పూరీ జగన్నాథ్ టాలెంట్ చూసి ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. పూరి ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి సినిమా సినిమాకు అభిమానులను పెంచుకుంటూ వెళ్లారు. మూవీ బాక్సాఫీస్ హిట్టా? లేదంటే డిజాస్టరా? అన్నదానితో సంబంధం లేకుండా ఆయన సినిమాలకు ఫ్యాన్స్ పెరుగుతూ వెళ్లారు.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పూరికి ఉన్న క్రేజ్ మరో డైరెక్టర్ కు లేదంటే అతిశయోక్తి కాదు. పోకిరీ, బిజినెస్‌మన్ తదితర సినిమాలను ముంబై బ్యాక్ డ్రాప్ లో తీసి భారీ సక్సెస్ దక్కించుకున్నాడు. అయితే పూరి జగన్నాథ్ విడుదల షెడ్యూల్స్ కు కట్టుబడి ఉంటారు. చిత్రీకరణ సమయంలో విడుదల తేదీలను ప్రకటించే ధోరణిని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది పూరి జగన్నాథే. దీన్ని ఇప్పుడు చాలా మంది నిర్మాతలు అనుసరిస్తున్నారు.
కానీ, ఈ సారి ఆయన షెడ్యూల్ కు బ్రేక్ పడింది. ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ డేట్ ను మొదట మార్చి 8, 2024గా ప్రకటించినప్పటికీ అనుకోని పరిస్థితుల నేపథ్యంలో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘డబుల్ ఇస్మార్ట్’ ఆ తేదీకి విడుదల కాకపోవడంతో విశ్వక్ సేన్ ‘గామి’, గోపీచంద్ ‘భీమా’ చిత్రాలు మార్చి 8 స్లాట్ దక్కించుకున్నాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ మే లేదా జూన్ తర్వాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.