Businessman : పూరి జగన్నాథ్ అంటే సినిమా పరిశ్రమలో విభిన్నమైన దర్శకుడిగా గుర్తింపు ఉంది. పూరీ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో హీరోయిజం డిఫరెంట్ గా ఉంటుంది. అతని చిత్రాల్లో నటించే అవకాశం కోసం చాలా మంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. అతని దర్శకత్వం లో ఒక్క మూవీ లో హీరోగా చేసిన చాలు అనుకునే నటులు ఇండస్ట్రీ లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారనడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి దర్శకుడు ఇప్పటివరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ చిత్రాలు బంపర్ హిట్ సాధించాయి. ఇవి మహేశ్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లు గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలు చేశాయి. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా అగస్ట్ 9, 2023 న ‘బిజినెస్‌మెన్’ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు.
పూరి, మహేశ్ కలయికలో పోకిరి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘బిజినెస్‌మెన్’ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో మహేశ్ డైలాగ్ డెలివరీ, యాక్షన్ అద్భుతం గా ఉన్నాయి. ప్రస్తుతం మూవీస్ రీ రిలీజింగ్ ట్రెండ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా మహేశ్ జన్మదినం సందర్బంగా ‘బిజినెస్ మెన్’ మూవీని చిత్ర బృందం మళ్ళీ విడుదల చేస్తున్నారు
ఇక ఈ సినిమా రీ రిలీజ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.1.36 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వసూళ్లు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. ఈ మూవీలో అందరూ అద్భుతంగా నటించారు. ఇక హీరోయిన్ కాజల్ ఫ్రెండ్ పాత్ర అందరిని ఆకట్టుకుంది. ఇందులో డబ్బు, హోదా ను తెగ ప్రేమించే పాత్రలో ‘ఆయేషా శివ’ తనదైన శైలి లో నటించి మెప్పించింది. తన డిఫరెంట్ డైలాగ్స్ తో అందరిని ఆకట్టుకుంది. అంతకుముందు ఆయేషా పలు బాలీవుడ్ మూవీల్లో నటించింది. బాలీవుడ్ చిత్రంలో ఆయేషా నటన ను చూసి ‘బిజినెస్ మెన్’ లో కాజల్ స్నేహితురాలి పాత్ర కోసం సెలెక్ట్ చేశాడు పూరీ. ఈ మూవీ తర్వాత ఆమె తెలుగులో నటించలేకపోయింది. దీంతో అభిమానులు కొంత నిరాశపడ్డట్లు తెలుస్తోంది.