Dr. Jai Garu Congrats to New TANA Members : తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో తానా ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదులను తోసి పుచ్చుతూ కొత్తగా ఎన్నికైన బోర్డు సభ్యులు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకాలకు ఆమోదముద్ర లభించింది. మార్చి ఒకటి నుంచి కొత్త బోర్డు పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డ్ చైర్మన్ హనుమ య్య బండ్ల తెలిపారు. ఈ మేరకు సభ్యులు పంపిన లేఖలో ఈ విషయాన్ని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన పూజ సమావేశంలో ఎన్నికల ఓటింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి వాటిని తోసి పుచ్చడంతోపాటు ఎన్నికల కమిటీ పంపిన ఫలితాలను పరిగణలోకి తీసుకుంటూ కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికకు అధికారికంగా బోర్డు ఆమోదముద్ర వేసింది.
నూతనంగా ఎన్నికైన తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను డాక్టర్ జై గారు అభినందనలు తెలియ జేశారు. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి చైర్మన్ గా ఎన్నిక య్యారు. సెక్రటరీగా లక్ష్మీ దేవినేని ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా జనార్దన్ నిమ్మల పూడి ఎన్నికయ్యారు. మొత్తం ప్యానల్ సభ్యులందరికీ కూడా జై గారు అభినందించారు.