
Mahesh Babu :
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే యంగ్ హీరోలా కనిపిస్తూ ఫ్యాన్స్ ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పటికే ఈయన కెరీర్ లో 27 సినిమాలు పూర్తి చేసాడు. ఇప్పుడు త్రివిక్రమ్ తో 28వ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఇటీవలే స్టార్ట్ అయ్యింది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు.
అయితే ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా బ్లాక్ బస్టర్స్ ను వదులు కున్నాడు.. ఆయన క్రేజీ డైరెక్టర్ లను పక్కన పెట్టేసారు.. ఆ లిస్టులో ఉన్న సినిమాలన్నీ చేసి ఉంటే మహేష్ ఇమేజ్ ఇంకా పెరిగి ఉండేది అని పాన్ ఇండియా లెవల్లో ఎప్పుడో పాపులర్ అయ్యేవాడు అంటూ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన పక్కన పెట్టిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఎప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కించే సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు.. అసలు ఈ సినిమా కథను ముందుగా సుకుమార్ మహేష్ కు చెప్పారట.. కానీ ఇందులో రగ్గడ్ లుక్ లో కనిపించాలని మహేష్ వద్దన్నారట..
అలాగే సుదీప్ వంగ తో మహేష్ సినిమా చేద్దామని మంచి కథతో ఆయనను రమ్మన్నారట.. అయితే ఈయన రెడీ చేసుకుని వెళ్లి కథ చెప్పగా అది బాలేదని అన్నారట. మళ్ళీ మరో రెండు కథలు వినిపించిన నచ్చలేదని చెప్పడంతో అదే కథలలో ఒక కథతో రణబీర్ తో యానిమల్ సినిమా చేస్తున్నారని టాక్..
అలాగే మహేష్ వెట్రిమారన్, పూరీ జగన్నాథ్ వంటి డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్లు కథలు చెప్పిన నో చెప్పారట.. బిజినెస్ మాన్ తర్వాత పూరీ కథ చెప్పగా వీరి కాంబోలో సినిమా రాలేదు.. జనగణమన వంటి కథను సిద్ధం చేసిన నో చెప్పారట.. ఇక కేజిఎఫ్ వంటి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన నీల్ కు కూడా మహేష్ నో చెప్పారట.. ఇంత మందిని కాదని రాజమౌళి సినిమాకు ఈయన ఓకే చెప్పారని తెలుస్తుంది.