Money : మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే తిరిగి రాకపోతే సమస్యలు వస్తాయి. అయినా వారు మనల్ని తిప్పుకుంటారు. ఇచ్చిన డబ్బు ఇవ్వడంలో తాత్సారం చేస్తే మనకు కూడా ఇబ్బందులొస్తాయని చాలా మందికి తెలియదు. కానీ ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లు మనుషుల్లో స్వార్థం పెరుగుతోంది. అందుకే వారు ఇచ్చిన బాకీలు చెల్లించడంలో వచ్చే సమస్యలు గుర్తించడం లేదు.
మనం ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని మనం అడగకుండా మరొకరి చేత అడిగించడం మంచిది. మీరు పడే బాధ అతడికి తెలియజేయండి. డబ్బు అవసరం ఉందని సూటిగా చెప్పండి. అప్పు ఇచ్చినప్పుడు మెల్లగా వసూలు చేసుకోవాలి. మన డబ్బు తిరిగి ఇవ్వకపోతే లీగల్ గా కూడా వెళ్లొచ్చు. న్యాయపరంగా 406, 420 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయవచ్చు.
డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఎఫ్ ఐఆర్ కూడా నమోదు చేయొచ్చు. న్యాయపరంగా చట్టపరంగా మనం ముందుకు వెళ్లొచ్చు. లాయర్ ను పెట్టుకుని సివిల్ సూట్ కూడా దాఖలు చేయొచ్చు. ఇచ్చిన డబ్బులు సమయానికి ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ ఎవరు కూడా లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇవ్వడానికి సుముఖంగా ఉండాలి.
చెప్పిన గడువులోగా తీసుకున్న డబ్బులు చెల్లించకపోతే చాలా రకాల సమస్యలు వస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఆపద కాలంలో ఉన్నప్పుడు ఏదో ఆదుకోవాలని బంధువులు అప్పుగా ఇస్తుంటారు. కానీ తీర్చే క్రమంలో వాయిదాలు వేస్తూ ఉంటారు. ఇవాళ రేపు అంటూ దాటేస్తుంటారు. ఇచ్చిన బాకీలు వసూలు చేసుకునేందుకు వారు నానా తంటాలు పడుతుంటారు.