Nagashaurya : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో నాగ సౌర్య ఒకరు.. ఈయన ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ముఖ్యంగా ఛలో సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు. అయితే ఆ తర్వాత నాగ సౌర్య ఆ రేంజ్ హిట్ మరొకటి అందుకోలేదు అనే చెప్పాలి..
ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ సౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”రంగబలి”.. ఈ సినిమాకు డైరెక్టర్ పవన్ బసమసెట్టి దర్శకత్వం వహిస్తుండగా జులై 7న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే..
ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో నాగసౌర్య ఒకానొక సమయంలో రోడ్డు మీద ఇద్దరు లవర్స్ గొడవపడుతుంటే నాగ సౌర్య కారు ఆపి దిగి వచ్చి ఆ అబ్బాయికి వార్ణింగ్ ఇవ్వగా ఆ వీడియో అప్పట్లో సంచలనం రేపింది. ఈ వీడియోపై నాగ సౌర్య మరోసారి స్పదించారు.
ఆ గొడవలో తప్పంతా ఆ అమ్మాయిదే అని.. పని మీద వెళ్తుండగా ఒక అబ్బాయి అమ్మాయిని కొడుతూ కనిపించగా అక్కడికి వెళ్లి ఎందుకు కొడుతున్నావా సారీ చెప్పు అని అడిగారట. కానీ ఆ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ నన్ను కొడుతాడు.. చంపుతాడు.. మీకెందుకు అంది.. అమ్మాయిలే ఇలా అంటే ఇంకేం చెప్తాము.. కానీ నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.. ఇలా కొట్టేవాడిని అస్సలు పెళ్లి చేసుకోవద్దు.. మీ జీవితంలో ఎవరిని నమ్మాలి? ఎవరిని నమ్మకూడదు అనే విషయం ఆలోచించుకోవాలి అని తెలిపారు..