36.1 C
India
Saturday, May 4, 2024
More

    Hardik Pandya’s Injury : హార్దిక్ పాండ్యాకు గాయం.. ఇక ఆ డ్యాషింగ్ ఆల్ రౌండర్ ఎంట్రీ ఖాయమా?

    Date:

    Hardik Pandya's Injury
    Hardik Pandya’s Injury

    Hardik Pandya’s Injury : వరల్డ్ కప్ 2023 రోహిత్ సేన దూసుకెళ్తున్నది. వరుసగా నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచింది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు ఓటమే ఎరుగని జట్టుగా నిలిచింది. జట్టు సమష్టిగా రాణిస్తుండడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

    అయితే తొలి రెండు మ్యాచులకు డ్యాషింగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ లేకపోవడం కొంత వెలితిగా కనిపింది. అయినా ఫస్ట్ మ్యాచ్ ఆస్ర్టేలియాపై, సెకండ్ మ్యాచ్ అఫ్గానిస్థాన్ పై రోహిత్ సేన అలవోకగా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ దాయాది పాకిస్థాన్ పై గెలిచింది. ఇక నాలుగో మ్యాచ్ బంగ్లాదేశ్ పై అద్బుత విజయాన్ని మూటగట్టుకుంది.

    పుణె వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇందులో విరాట్ కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక  న్యూజిలాండ్ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో టీమిండియా కొనసాగుతున్నది. నెట్ రన్ రేట్ తో కివీస్ టాప్ లో కొనసాగుతున్నది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో అల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం రోహిత్ సేనను వేధిస్తున్నది. అయితే పాండ్యా గాయం తీవ్రతపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న మ్యాచ్ లు కివీస్, శ్రీలంకతో ఉండడంతో మరి పాండ్యా జట్టుతో చేరుతాడా లేదా అనే అనుమానం మాత్రం ఉంది. ఇప్పుడు జట్టులో పాండ్యా కీలకం. ఒకవేళ గాయం తగ్గకపోతే పాండ్యా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది కీలకాంశం.

    పేస్ అల్ రౌండర్ లేదా స్సిన్  అల్ రౌండర్ ను జట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్ శివమ్ దూబే పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఆల్ రౌండర్ ప్రతిభను పోల్చుకుంటే అక్షర్ పటేల్ కు అవకాశం దక్కే చాన్స్ కనిపిస్తున్నది. కొంతకాలంగా నిలకడగా ఆడుతున్న అక్షర్ పటేల్ వైపై జట్టు మేనేజ్ మెంట్ శ్రద్ధ చూపే చాన్స్ ఉంది.

    Share post:

    More like this
    Related

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...

    Congress MP Candidate : టికెట్ వెనక్కు ఇచ్చిన ఎంపీ అభ్యర్థి

    Congress MP Candidate : ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీకి...

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Photo Story : బిగ్ బాస్ గర్ల్ అరియానా గ్లోరీ గ్లామ్ ట్రీట్

    Photo Story : పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్‌తో విపరీతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్ కు..  గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు నేడు

    DC Vs GT : ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ టైటాన్స్ మధ్య...

    IPL 2024 : ఐపీఎల్ లో ఇప్పటివరకు ఎవరెన్నీడాట్ బాల్స్ వేశారంటే..

    IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ లో బ్యాటర్లు దుమ్ము...