37.8 C
India
Monday, April 29, 2024
More

    Chandrababu Bail and Custody : చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా!

    Date:

    Chandrababu Bail and Custody
    Chandrababu Bail and Custody
    Chandrababu Bail and Custody : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌, కస్టడీ పిటిషన్ల పై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్‌లపై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి తెలిపారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు తమ వాదనలు వినాలని బాబు తరఫు లాయర్లు జడ్జికి విన్నవించారు. ఈరోజు వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని ఏసీబీ కోర్టు జడ్జి పేర్కొన్నారు.  బుధవారం నుంచి తాను సెలవులపై వెళ్లనున్నట్లు తెలిపారు.
    బుధవారం రెగ్యులర్‌ కోర్టులో వాదనలు వినిపించాలని ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జి చంద్రబాబు తరఫు న్యాయవాదికి సూచించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో.. ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి వ్యవహరించారు. ఆయనే చంద్రబాబు బెయిల్‌, కస్టడీ పిటిషన్ల విచారణ వాయిదా వేశారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇక అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో హైకోర్టులో ఇదే రోజు వాదనలు ప్రారంభం కానున్నాయి.
    మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోను పరిశీలనలోకి తీసుకున్న సీజేఐ.. రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరం తెలిపారు. అయితే ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో నేటి సాయంత్రానికి తెలియరానుంది.

    Share post:

    More like this
    Related

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP CID : స్కిల్ డెవలప్ మెంట్  కేసులో చార్జి సీటు దాఖలు చేసిన ఏపీ సీఐడీ

    AP CID : టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న...

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...

    AP CID Vs Chandrababu : చంద్రబాబుపై మరో కేసు పెట్టిన సీఐడీ

    AP CID Vs Chandrababu : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై...

    Chandrababu : ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు షాక్..

    Chandrababu : చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్...