38.3 C
India
Thursday, May 2, 2024
More

    WWE John Cena & karthi : జాన్ సీనాతో ఖైదీ.. సోషల్ మీడియా షేక్..!

    Date:

    WWE John Cena & karthi :

    డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ లో పాల్గొనేందుకు ప్రముఖ రెజ్లర్.. హాలీవుడ్ యాక్టర్ జాన్ సీనా హైదరాబాద్ వచ్చాడు.  భాగ్యనగరంలోని బాలయోగి స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ స్పెక్టేకిల్ ఈవెంట్ జరుగగా చివరి మ్యాచ్‌లో జాన్ సీనా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో కార్తీ జాన్ సీనాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.

    జాన్ సీనాతో తను దిగిన ఫొటోను కార్తీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘జాన్ సీనా.. నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.. నన్ను ఇంత మంచిగా రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.. ఆ కొన్ని క్షణాల్లోనే అందరూ స్పెషల్ అనే ఫీలింగ్ కలిగించావ్.. అది నీకు మాత్రమే సాధ్యం..’ అంటూ కార్తీ తన ఎక్స్(ట్విట్టర్లో) రాసుకొచ్చాడు.

    జాన్ సీనా పక్కన కార్తీని చూసి ఫ్యాన్స్ తెగ సంతోషపడుతున్నారు. పనిలో పనిగా ఒక సినిమాలో యాక్ట్ చేస్తాడేమో కొనుక్కో పోయావా? అంటూ కార్తీని అడుగుతున్నారు. జాన్ సీనా ప్రస్తుతం డబ్ల్యుడబ్ల్యుఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్‌గా ఉన్న సెత్ రోలిన్స్‌తో కలిసి ట్యాగ్ టీం మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే కొంతకాలంగా డబ్ల్యుడబ్ల్యుఈకి దూరంగా ఉంటున్న జాన్ సీనా హాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
    ‘ది సూసైడ్ స్క్వాడ్’ చిత్రంలో పీస్ మేకర్ పాత్రలో జాన్ సీనా అద్భుతంగా నటించాడు. దీంతో అతనితోనే ప్రత్యేకంగా పీస్ మేకర్ అనే సిరీస్ ను సైతం నిర్మాతలు చేశారు. ఇది కూడా ఫ్యాన్స్‌ను తెగ అలరించింది. డబ్ల్యుడబ్ల్యుఈకి దూరంగా ఉంటున్నా కూడా ఆయన భారత్‌లో ప్రోగ్రాం అనగానే ఒప్పుకోవడం విశేషం. అంతేకాకుండా ఇండియాకు వచ్చేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని కొద్దిరోజుల క్రితం ట్వీట్ కూడా చేశాడు.

    ఈ షో ముగింపులో జాన్ సీనా మాట్లాడుతూ తాను ఈ క్షణం కోసం 20 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. తనను ఇలా అందరి ముందు నిలబడే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. తమ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ఎమోషనల్ కావడంతో ఫ్యాన్స్ సైతం ‘జాన్ సీనా.. జాన్ సీనా..’ అంటూ స్టేడియాన్ని హోరెత్తించారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ACTOR KARTHIK:మద్యానికి బానిసై కెరీర్ పాడు చేసుకున్న హీరో

    మద్యానికి బానిసై కెరీర్ ని పాడు చేసుకున్న హీరోలు చలనచిత్ర రంగంలో...