you Not Marriage : ధర్మ, అర్థ, కామాల్లో తోడు అనేది అవసరం. తోడు అంటే కేవలం ఒకరితో ఒకరు కలిసి ఉండడం (లివింగ్) కాదు. వైధికంగా, మంత్రోశ్చరణల మధ్య ఇద్దరు ఒక్కటైతేనే అది పెళ్లి. మానవ జీవితంలో పెళ్లికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది సనాతన ధర్మంలో కూడా స్పష్టంగా ఉంది. వేద మంత్రాలతో కట్టిన తాళికి ఇల్లాలు ఆజన్మాంతం కట్టుబడి ఉంటుంది. తను చనిపోయేంత వరకు భర్తకు తోడుగా ఉంటుంది.
ఇవన్నీ ఇక్కడి సంప్రదాయాలు. అయితే డెన్మార్క్ లో ఒక వింత ఆచారం ఉంది. అక్కడ పాతికేళ్లు నిండితే పెళ్లి జరగాలి. ఒక వేళ పెళ్లి జరగలేదంటే అభిషేకం చేసినట్లు తల మీద నీళ్లు కుమ్మరిస్తారు. ఇక తర్వాత తల వెంట్రుకల నుంచి పాదాల వరకు దాల్చిన చెక్క పొడిని జల్లుతారు. దీన్ని వారు ఆచారంగా నిర్వర్తిస్తున్నారు. ఇందులో లింగ భేదం ఉండదు. పాతికేళ్లు వచ్చిన అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా.. ఈ శిక్షకు అర్హులే అన్నట్లు.
ఈ ఆచారం ఈ దేశంలో వందల ఏండ్ల నుంచి ఆచరణలో ఉంది. దీని వల్ల ఫలితం వారికే తెలియకున్నా.. తమ ఆచారం తాము పాటిస్తున్నామని మాత్రం చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఆచారన్ని అక్కడి వారు ఎవరూ వ్యతిరేకించడం లేదు. అయితే దీన్ని సదరు వ్యక్తులు శిక్షగా భావించరట.